టాలీవుడ్ క్యూట్ బ్యూటీ సమంత.. అక్కినేని ఇంట అడుగుపెట్టిన తర్వాత కోడలి బాధ్యతతో పాటు అనేక బాధ్యతలు చేపట్టింది. జీ తెలుగు ఛానెల్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైంది. ఈ ఛానల్ ని తెలుగు ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి కష్టపడుతోంది. అలాగే పెళ్ళికి ముందు ఒప్పుకున్న ప్రాజక్ట్ పూర్తి చేస్తూనే.. కొత్త సినిమాలకు సైన్ చేస్తోంది. అదే విధంగా రాజకీయంలోకి అడుగు పెడుతున్నట్టు వారం రోజులుగా వార్తలు గుప్పుమన్నాయి. టి.ఆర్.ఎస్ పార్టీ ఆమెకు స్వాగతం పలికినట్లు రూమర్స్ పుట్టుకొచ్చాయి. 2019 ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం టికెట్ ఆఫర్ చేసిందని పుకారు రాయుళ్లు గోల చేశారు. అయితే ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదని సమంత సన్నిహితులు చెప్పారు.
అసలు ఆమెకు రాజకీయంలో వెళ్లాలనే ఆలోచనే లేదని స్పష్టం చేశారు. వీలైతే నటిగా మరిన్ని సామజిక కార్యక్రమాలు చేపట్టడానికి ఉత్సాహంగా ఉందని వెల్లడించారు. ఇంతటితో ఈ గాసిప్ కి బ్రేక్ పడనుంది. ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే.. సుకుమార్ దర్శకత్వంలో సమంత చేస్తున్న రంగస్థలం మార్చి 30వ తేదీన రిలీజ్ కానుంది. సమంత అభినయ సత్యభామ జమున గా నటించిన మహానటి మార్చి 29న థియేటర్లోకి రానుంది. ఇక కొత్త సినిమా ఈనెల ప్రారంభం కానుంది. కన్నడ మూవీ యూ టర్న్ చిత్ర రీమేక్ లో సమంత లీడ్ రోల్ పోషించనుంది.