Samantha: సమంత కొత్త పోస్ట్ లు చూశారా..?

స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూనే ఉంది. తాజాగా ఈ బ్యూటీ హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ పుస్తకం నుంచి ఓ కొటేషన్ ను షేర్ చేసింది. విల్ స్మిత్ జీవితంలో జరిగిన ఓ సంఘటనను తనతో కంపేర్ చేసుకుంటూ ఈ కొటేషన్ ను షేర్ చేసినట్లుంది సమంత. ఇంతకీ అందులో ఏమని రాసి ఉందంటే..?

Click Here To Watch

”గత 30 ఏళ్లుగా అందరిలాగే నేను కూడా వైఫల్యం, నష్టం, అవమానం, విడాకులు వంటి వాటిని ఫేస్‌ చేశాను. ప్రాణహాని బెదిరింపులు కూడా వచ్చాయి. నా డబ్బు పోయింది. నా ప్రైవసీని అతిక్రమించారు. నా కుటుంబం విచ్ఛిన్నమైంది” అంటూ భావోద్వేగ పోస్ట్‌ను షేర్‌ చేసింది. దీంతో పాటు ప్రతిరోజు ఇటుకను కాంక్రీట్ కలిపి పేర్చాలని మీరు ఏ దారిలో వెళ్తున్నా అక్కడ ఒక ఇటుక పేర్చేందుకు ఉంటుందని.. కానీ ఆ ఇటుకను పేర్చేందుకు నువ్వు లేచి నిలబడాలంటూ పేర్కొంది సమంత.

మరో పోస్ట్ లో.. ‘కష్టపడి పని చేయండి. మీకు తగిలిన ఎదురుదెబ్బల నుంచి నేర్చుకోండి. మిమ్మల్ని మీరు చూసుకోండి. మిమ్మల్ని మీరు ప్రతి రోజూ ఆవిష్కరించుకోండి’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఈ పోస్ట్ లు బాగా వైరల్ అవుతున్నాయి. విడాకుల తరువాత సమంత మనసులో ఉన్న బాధను అప్పుడప్పుడు ఈ పోస్ట్ ల రూపంలో తెలియజేస్తుంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన ‘శాకుంతలం’ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

మరోపక్క ‘యశోద’ అనే సినిమాలో నటిస్తోంది సమంత. దీంతో పాటు ఓ బైలింగ్యువల్ సినిమా అలానే ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ ఓకే చేసింది. వీటితో పాటు ఓ బాలీవుడ్ సినిమాలో కూడా నటించబోతుందని సమాచారం. మొత్తానికి సమంత తన కెరీర్ లో చాలా బిజీ అయిపోయింది.

భీమ్లా నాయక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ తో పాటు పవన్ హీరోగా రీమేక్ అయిన 12 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus