Samantha: నా జీవితంలో అవి చీకటి రోజులు.. విడాకులపై స్పందించిన సామ్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. అదేవిధంగా మరోవైపు ఆమె నటించిన శాకుంతలం సినిమా విడుదల కానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో కూడా బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమా షూటింగులు ప్రమోషన్ కార్యక్రమాలు అంటూ బిజీగా గడుపుతున్నటువంటి సమంత పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ తన సినిమా కెరియర్ గురించి మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితం గురించి కూడా కొన్ని విషయాలు తెలియజేస్తున్నారు.

ముఖ్యంగా నాగచైతన్యతో తన బంధం విడిపోవడానికి గల కారణాలను ఈమె తెలియజేస్తున్నారు. గత రెండు రోజుల క్రితం మ్యారీడ్ లైఫ్ లో భార్యగా తను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యతలు తీసుకున్నానని అయితే వర్కౌట్ కాలేదు అంటూ తెలిపారు. అయితే తాజాగా మరోసారి నాకు చైతన్యతో విడిపోయిన తర్వాత చాలామంది విడాకులు విషయంలో సమంతను భారీగా ట్రోల్ చేశారు. ఇలా తనపై జరిగిన ట్రోలింగ్ గురించి తాజాగా సమంత స్పందించారు.

ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ.. అవి నా జీవితంలో చీకటి రోజులు ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తుండేవి అయితే ఆ ఆలోచనలు నన్ను నాశనం చేయకూడదని నిర్ణయించుకున్నాను. ఆ సమయంలో నా మనసుకు నచ్చిన విధంగా రియాక్ట్ అవుతూ ముందడుగు వేశాను.అయితే ఆ సమయంలో నాకు కుటుంబ సభ్యులు స్నేహితులు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారని సమంత వెల్లడించారు.

ఇలా ఎంతో మంది తనకు (Samantha) ధైర్యం ఇచ్చినప్పటికీ ఇంకా ఆ బాధ నుంచి బయటపడలేకపోతున్నానని అయితే ముందుతో పోలిస్తే ప్రస్తుతం ఆ చీకటి రోజులు కాస్త తగ్గాయనే చెప్పాలి. అయితే మనకు ఇలా క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు మనం వాటిలో చిక్కుకొని ఉండిపోకూడదని ధైర్యంతో ముందడుగు వేసినప్పుడే దేనినైనా సాధించగలం అంటూ ఈ సందర్భంగా సమంత చేసినటువంటి కామెంట్స్ వైరల్ వస్తున్నాయి. ప్రస్తుతం సమంత సిటాడేల్, ఖుషి సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus