Samantha: వైరల్ అవుతున్న హీరోయిన్ సమంత షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్య కాలంలో సైలెంట్ అయ్యారనే సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో కూడా సమంత గతంలోలా యాక్టివ్ గా లేకపోవడం ఫ్యాన్స్ ను ఒకింత బాధ పెడుతోంది. ప్రస్తుతం సమంత మయొసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధ పడుతున్నారు. సమంత ఆరోగ్య సమస్యల వల్ల ఆమె నటిస్తున్న సినిమాల షూటింగ్ లు అంతకంతకూ ఆలస్యమవుతున్నాయి. అయితే తాజాగా సమంత ఒక సందర్భంలో తనకు సంబంధించిన ఎన్నో షాకింగ్ విషయాలను రివీల్ చేశారు.

ఎప్పుడైనా నాకు కోపం వస్తే వెంటనే జిమ్ కు వెళ్లిపోయి ఇష్టానుసారం వ్యాయామం చేస్తానని ఆమె అన్నారు. అలా చేస్తే వెంటనే కోపం తగ్గిపోతుందని సామ్ పేర్కొన్నారు. నాకు డబ్బు కంటే యాక్టింగ్ ముఖ్యమని డబ్బు, పేరు ప్రఖ్యాతుల కోసం నేను అస్సలు ఆరాటపడనని సమంత వెల్లడించారు. తాను మూవీలో నటించే ప్రతి పాత్రను ఆస్వాదిస్తానని ఆమె పేర్కొన్నారు. నాకు నేనే పెద్ద క్రిటిక్ అని సమంత షాకింగ్ కామెంట్లు చేశారు.

మనం వృత్తిలో ఎదగాలంటే తప్పులు, పొరపాట్లను తెలుసుకుని సరిదిద్దుకోవాలని అలా చేస్తే మాత్రమే మనం కెరీర్ పరంగా ఎదిగే ఛాన్స్ అయితే ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే కాలం కూడా కలిసిరావాలని సమంత కామెంట్లు చేశారు. నీకు నచ్చిన విధంగా నువ్వు ఉండాలని సమంత పేర్కొన్నారు. ఎవరి అభినందనల కోసమో నువ్వు భూమి మీదకు రాలేదని ఆమె కామెంట్లు చేశారు. మనకు ఉన్నదానిలో సంతోషంగా ఉండటానికి అలవాటు పడాలని సమంత అభిప్రాయపడ్డారు.

అలా చేయడం ద్వారా మనకు అవసరమైనవి మనల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశం అయితే ఉంటుందని సమంత కామెంట్లు చేశారు. సమంత చెప్పిన విషయాలు నూటికి నూరు శాతం కరెక్ట్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus