Samantha: ఆ బ్యానర్ తో చర్చలు జరుపుతున్న సమంత!

విడాకుల ప్రకటన తర్వాత స్టార్ హీరోయిన్ సమంత కెరీర్ పరంగా బిజీ అయ్యే దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో ప్రాజెక్టులను ప్రకటించిన సమంత ఒక హాలీవుడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇతర స్టార్ హీరోయిన్లకు సైతం షాక్ ఇచ్చే దిశగా సమంత అడుగులు వేస్తున్నారు. బాలీవుడ్ ప్రాజెక్ట్ లకు కూడా సమంత గ్రీన్ సిగ్నల్ ఇస్తారని ప్రచారం జరగగా ఆ మేరకు ప్రకటన వెలువడలేదు.

అయితే స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం బాలీవుడ్ బడా బ్యానర్లలో ఒకటైన యష్ రాజ్ ఫిల్మ్స్ తో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఈ సంస్థలో ఒకేసారి రెండు లేదా మూడు సినిమాలకు ఒప్పందం చేసుకోవాలని సామ్ భావిస్తున్నట్టు బోగట్టా. ఈ బ్యానర్ లో నటించిన హీరోయిన్లకు క్రేజ్ తో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఆ రీజన్ వల్లే సమంత ఈ బ్యానర్ లో సినిమాలు చేయడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది.

యష్ రాజ్ ఫిల్మ్స్ తో కాంట్రాక్ట్ కు సమంత అంగీకరిస్తే నాలుగేళ్ల పాటు ఆ బ్యానర్ కే పరిమితమయ్యే ఛాన్స్ ఉంది. ఫ్యామిలీ మ్యాన్ సీజన్2తో బాలీవుడ్ ఇండస్ట్రీలో వచ్చిన క్రేజ్ ను మరింత పెంచుకునే దిశగా సమంత అడుగులు వేస్తున్నారు. అన్ని ఇండస్ట్రీలలో వరుసగా అవకాశాలను సంపాదించుకుంటూ సమంత అభిమానులను సైతం ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు. హీరోయిన్ సమంత తన రెమ్యునరేషన్ ను కూడా భారీగా పెంచారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus