Samantha: యాక్షన్ సీన్స్ ఇరగదీసిన సామ్.. దెబ్బకి బాలీవుడ్ లో సెటిల్ అయిపోద్దేమో!

ఆంజనేయుడికి తన బలం తనకు తెలియదు అన్నట్లు.. మన నటీమణుల సత్తా ఏమిటి అనేది మన దర్శకులకు కూడా తెలీదు. తెలుసుకొనే ప్రయత్నం కూడా చేయరు. అందుకు తాజా ఉదాహరణ సమంత. తెలుగులో ఆమెను క్యూట్ హీరోయిన్ గా మాత్రమే ప్రాజెక్ట్ చేస్తూ హీరోతో సరసాలు, కొన్ని పాటలకు పరిమితం చేశారు. అయితే.. ఆమె “ఫ్యామిలీ మ్యాన్” సిరీస్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది. బోల్డ్ సీన్స్ లో యాక్ట్ చేయగల దమ్ము మాత్రమే కాదు యాక్షన్ సీన్స్ లో చెలరేగిపోగల సత్తా కూడా ఉందని కాస్త రుచి చూపించింది.

Samantha

అయితే.. ఇవాళ విడుదలైన “సిటాడెల్: హనీ బన్నీ” ట్రైలర్ లో సమంత యాక్షన్ బ్లాక్స్ చూసినవాళ్లందరూ షాక్ కి గురవుతున్నారు. బాలీవుడ్ కాదు ఏకంగా హాలీవుడ్ రేంజ్ యాక్షన్ బ్లాక్ లో శివతాండవం చేసింది. గన్స్ ఫైరింగ్ ఏంటి, ఫైట్స్ ఏంటి హీరోకి ఏమాత్రం తీసిపోని విధంగా నటించింది. రాజ్ & డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. ఇవాళ ఈ సిరీస్ ట్రైలర్ ను విడుదల చేశారు.

గత కొంతకాలంగా సమంత (Samantha) తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. మొన్నామధ్య త్రివిక్రమ్ కూడా “సమంతకు మనం అందరం హైదరాబాద్ కు దారేది” అని చూపించాలి అని “జిగ్రా” ప్రీరిలీజ్ ఈవెంట్లో కోరిన విషయం తెలిసిందే. అయితే.. “సిటాడెల్ హనీ బన్నీ” ట్రైలర్ లో సమంతను చూసిన తర్వాత మాత్రం ఆమె మళ్లీ తెలుగులో నటించడానికి ఆసక్తి చూపిస్తుంది అనే నమ్మకం పోయింది. ఎందుకంటే..

ఈ స్థాయిలో యాక్షన్ బ్లాక్స్ లో ఇరగదీస్తూ, నటిగానూ మంచి హావభావాలు కనబరిస్తే, సమంతను బాలీవుడ్ అక్కున చేర్చుకోవడం ఖాయం. మరి సమంత ఏం డిసైడ్ చేసుకుంటుందో చూడాలి.

SDT18 గ్లింప్స్ లో తేజు లుక్ బాగుంది.. కానీ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus