Samantha: విడాకుల తరువాత తొలిసారి మీడియా ముందుకు!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత విడాకుల తరువాత మీడియా ముందుకు రాలేదు. ‘పుష్ప’ సినిమాలో ఆమె ఐటెం సాంగ్ చేసినప్పటికీ ప్రమోషన్స్ లో మాత్రం పాల్గొనలేదు. నాగచైతన్యతో విడిపోతున్నట్లు ప్రకటించిన ఏడు నెలల తరువాత ఆమె ఇప్పుడు మీడియా ముందుకు రానుంది. ఒక సినిమా ప్రమోషన్ కోసం సమంత బయటకు వస్తోంది. తమిళంలో సమంత నటించిన సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. నయనతార, విజయ్ సేతుపతి, సమంత కలిసి నటించిన సినిమా ‘కణ్మణి రాంబో ఖతీజా’.

ఈ సినిమా ప్రమోషన్ ను మొదలుపెట్టింది చిత్రబృందం. నిజానికి నయనతార తన సినిమాల ప్రమోషన్స్ కి దూరంగా ఉంటుంది. కానీ ఈ సినిమాను ఆమె ప్రమోట్ చేయక తప్పదు. ఎందుకంటే.. ఆమెకి కాబోయే భర్త విఘ్నేష్ శివన్ ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. పైగా నయనతార ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి. దాంతో.. ఆమె సమంతని కూడా ప్రమోషన్ ఈవెంట్స్ కి రావాలని కోరిందట. మొత్తానికి సమంత మీడియా ముందుకు రాబోతుంది.

‘బంగార్రాజు’ సినిమా ప్రమోషన్స్ సమయంలో నాగచైతన్య మీడియా ముందుకొచ్చినప్పుడు అతడికి డివోర్స్, సమంత గురించి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. దానికి చాలా కూల్ గా సమాధానాలిచ్చాడు చైతు. ఇప్పుడు సమంతకు కూడా ఆ తరహా ప్రశ్నలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఇక సమంత సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆమె ‘యశోద’ అనే సినిమాలో నటిస్తోంది. అలానే పలు సినిమాలను లైన్ లో పెట్టింది. బాలీవుడ్ లో కూడా సినిమాలు చేయబోతుంది. ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కూడా ఒప్పుకుంది ఈ బ్యూటీ.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus