విజయ్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌… ఆమె వచ్చేస్తోంది.. వీడియో కూడా వస్తుందా?

‘లైగర్‌’ లాంటి పడిన తర్వాత.. ఏ హీరో అయినా కుంగిపోతాడు. అయితే వెంటనే కొలుకొని సెట్స్‌ మీదకు వెళ్లి కొత్త సినిమా ప్రారంభించాలని కూడా అనుకుంటాడు. నిజానికి అలా అనుకునేవాడే ఎదుగుతాడు అంటారు. అలా ఎదగాలని అనుకుంటున్న విజయ్‌ దేవరకొండకు బ్రేక్‌ పడింది. అనుకోని కారణాల వల్ల కొన్ని రోజులు బ్రేక్‌ పడినా.. ఆ తర్వాత ఎందుకు ఇలా జరుగుతోంది అనేలా చేసింది. ఇదంతా ‘ఖుషి’ సినిమా గురించే అని మీకు అర్థమయ్యే ఉంటుంది.

సమంతతో కలసి శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్‌ నటిస్తున్న చిత్రం ‘ఖుషి’. ఈ సినిమా షూటింగ్‌ ఫుల్‌ స్వింగ్‌లో జరుగుతున్నప్పుడు ‘లైగర్‌’ ప్రచారం కోసం ఆపేశారు. ఆ తర్వాత మొదలెడదాం అనుకుంటే సమంత అనారోగ్యం పాలైంది. దీంతో సినిమాకు బ్రేక్‌లు పడ్డాయి. ఈ క్రమంలో సినిమా ఉంటుందా? ఉండదా? అనే మాటలూ వచ్చాయి. సమంత ఎప్పుడు కోలుకుంటుంది అనే ప్రశ్నలూ వచ్చాయి. అయితే ఇప్పుడు వీటన్నింటికి ఫుల్‌ స్టాప్‌ పెడుతూ సమంత డేట్‌ చెప్పేసిందని సమాచారం.

ప్రస్తుతం సమంత మళ్లీ చిత్రీకరణలతో బిజీగా మారింది. రాజ్‌ – డీకే తెరకెక్కిస్తున్న ‘సిటాడెల్‌’ అనే వెబ్‌ సిరీస్‌ కోసం రంగంలోకి దిగిన సమంత.. ఫుల్‌ స్వింగ్‌లో షూటింగ్‌లో పాల్గొంటోంది. అలా ఇప్పుడు ‘ఖుషి’ సినిమా సెట్లోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కొంత భాగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. కొత్త షెడ్యూల్‌ త్వరలో ప్రారంభం కానుందని సమాచారం. దీని కోసం ఈ నెల 27న విజయ్‌ దేవరకొండ సెట్లోకి అడుగు పెడతాడని చెబుతున్నారు. దీంతో సింగిల్ సీన్స్‌ తీస్తారేమో అనుకున్నారంతా.

అయితే మార్చి 8 నుండి సమంత షూటింగ్‌కి హాజరవుతుందని సమాచారం. నెల రోజుల పాటు హైదరాబాద్‌లోనే ఈ షెడ్యూల్‌ చిత్రీకరణ ఉంటుందట. అలెప్పీలో ఏప్రిల్‌లో మరో షెడ్యూల్‌ పెడతారట. కశ్మీర్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో విజయ్‌ ఆర్మీ అధికారిగా కనిపిస్తాడని సమాచారం. ఉమెన్స్‌ డే నాడు సమంత షూట్‌కి వస్తుంది కాబట్టి.. ఆమె గొప్పతనాన్ని కీర్తిస్తూ ఓ స్పెషల్‌ వీడియో టీమ్‌ నుండి వస్తుందని సమాచారం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus