Samantha: నటనలోనే కాదు మాటలు అనడంలోనూ స్ట్రాంగే!

సమంత సూపర్‌ స్ట్రాంగ్‌, బోల్డ్‌ స్టేట్‌మెంట్స్‌ ఇవ్వడంలోనూ అంతే స్ట్రాంగ్‌. ఈ మాటలు మేం అనడం లేదు. గత కొన్నేళ్లుగా సామ్‌ను దగ్గరనుండి చూసినవాళ్లు ఎవరైనా ఈ మాటే అంటారు. అలా సమంత ఇన్నేళ్ల తన కెరీర్‌లో కొన్ని కీలకమైన విషయాల్లో బలంగా, బోల్డ్‌గా సమాధానలు ఇచ్చినవి ఓ సారి చూస్తే చాలు.

* నాగచైతన్య – సమంత వివాహబంధం కొనసాగుతున్న సమయంలో కొన్ని మీడియాల్లో సమంత గర్భవతి అంటూ పెద్ద ఎత్తున పుకార్లు వార్తలుగా వచ్చాయి. దానికిపై ఓసారి సమంత మాట్లాడుతూ ‘‘నేను గత కొన్నేళ్లుగా గర్భవతిగా ఉన్నాను. నా కడుపులో బిడ్డ బయటకు రావడానికి ఇష్టపడటం లేదేమో’’ అంటూ సెటైరికల్‌గా తాను గర్భవతిని కాను అని చెప్పింది. దాంతో ఒక్కసారిగా ఆ రూమర్స్‌ ఆగిపోయాయి.

* మరో సందర్భంలో తన శరీరంలోని మార్పుల గురించి వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. ‘‘నా శరీరంలో వస్తున్న ఫంక్షనింగ్‌ మార్పుల గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారందరికీ ఇదే నా మాట. 2022 ఆగస్టు 7, ఉదయం 7 గంటలకు నేను బిడ్డను కంటానేమో’’ అంటూ కౌంటర్‌ ఇచ్చింది.

* సినిమా పరిశ్రమలో కాస్టింగ్‌ కౌచ్‌గా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలో కూడా సమంత స్పందించింది. తనకు అలాంటి అనుభవాలు ఎదురవ్వలేదని, అయితే ప్రతి పరిశ్రమలోనూ కాస్టింగ్‌ కౌచ్‌ ఉందని చెప్పింది. ప్రతి చోట బ్లాక్‌ షీప్స్‌ ఉంటాయని సమంత కౌంటర్‌ ఇచ్చింది.

* సినీ పరిశ్రమను పురుషాధిక్య సమాజం అంటూ ఉంటారు. ఈ మాటల్ని సమంత విశ్వసిస్తుంది. అవకాశం వచ్చినప్పుడల్లా ఈ మాటల్ని తన పోస్టులు, కామెంట్స్‌ ద్వారా చెబుతూనే ఉంటుంది. పరిశ్రమలో మహిళలకు అంత ఈజీ కాదు అని కూడా చెప్పింది. ఓ సినిమా పోస్టర్‌లో హీరో వెనుక హీరోయిన్‌ పాకుతూ వెళ్తున్న పోస్టర్‌ ట్వీట్‌ చేస్తూ సమంత ఘాటుగా స్పందించిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది.

* ఆహారమా? శృంగారమా? మీ ఓటు దేనికి అంటే.. నేటి తరం అమ్మాయిలు స్పందించడానికి కాస్త టైమ్‌ తీసుకుంటారు. కానీ సమంత ఓపెన్‌గా శృంగారం అని సమాధానం చెప్పేసింది.

* ఇక ఇటీవల తన అనారోగ్యం గురించి ఓపెన్‌గా ఫొటోను ట్వీట్‌ చేసి మరీ చెప్పింది. మంచి గురించి పది మందికి చెప్పాలంటే కావాల్సిన ధైర్యం కన్నా.. అనారోగ్యం గురించి చెప్పడానికి ఇంకా ఎక్కువ అవసరం. అంత ధైర్యం, బోల్డ్‌నెస్‌ ఆమెకు ఉంది కాబట్టే.. ఈ పని చేయగలిగింది.

ఫైనల్‌గా గెట్ వెల్‌ సూన్‌ సామ్‌.. నీ కోసం, నీ నటన కోసం ఫ్యాన్స్‌ వెయిటింగ్‌.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus