టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై నీలిమ గుణ నిర్మాణంలో తెరకెక్కుతున్న శాకుంతలం సినిమా ప్రారంభోత్సవం నేడు ఘనంగా జరిగింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న శాకుంతలం కోసం భారీ సెట్స్ ను నిర్మించగా సినిమాలోని దుశ్యంతుడి పాత్ర కొరకు మలయాళ నటుడు దేవ్ మోహన్ ఫైనల్ అయ్యారు. దిల్ రాజు కూడా శాకుంతలం సినిమా నిర్మాణంలో భాగమయ్యారు. దిల్ రాజు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ 2022 సంవత్సరంలో శాకుంతలం మూవీని విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు.
సమంత నటిస్తున్న సినిమా వచ్చే ఏడాది విడుదలవుతుందని తెలిసిన ఫ్యాన్స్ సమంతను చూడాలంటే అప్పటివరకు ఆగాలా..? అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. సమంత ప్రస్తుతం శాకుంతలం మినహా మరే సినిమాలోనూ నటించడం లేదు. మరోవైపు ఈ సినిమా కోసం సమంత ఏకంగా 150 రోజుల డేట్స్ ఇచ్చారని.. ఈ సినిమా కొరకు సమంత 3 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకున్నారని తెలుస్తోంది. తెలుగులో కొంతమంది స్టార్ హీరోలు మాత్రమే ఈ స్థాయిలో రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారని చెప్పాలి.
సినిమాలో శకుంతల, దుష్యంతుడి పాత్రలు పోటాపోటీగా ఉంటాయని మేకర్స్ చెబుతుండటం గమనార్హం. ఈ సినిమాలోని మరో కీలక పాత్ర కోసం తెలుగమ్మాయి ఈషా రెబ్బా ఎంపికయ్యారు. సమంత తొలిసారి పౌరాణిక పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. అతి త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని తెలుస్తోంది.