2018 ని కూడా మరిచిపోలేను : సమంత

క్యూట్ బ్యూటీ సమంత అతి తక్కువకాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అలాగే గత ఏడాది అక్కినేని కోడలిగా అడుగుపెట్టింది. అందుకే 2017 ని మరిచిపోలేనని సమంత అనేక సార్లు చెప్పింది. అయితే 2018 వచ్చి మూడు నెలలు కూడా పూర్తి కాకముందే తనకి ఎంతో ఇచ్చిందని ఆనందపడుతోంది. అందుకే ఈ ఏడాదిని కూడా ఎప్పటికీ మరిచిపోలేనని వెల్లడించింది. సమంత తమిళంలో విశాల్ పక్కన “ఇరుంబు తిరై(  అభిమన్యుడు), మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌తో తొలిసారి నటించిన “రంగస్థలం”, సమంత జమునగా నటించిన సావిత్రి బయోపిక్ “మహానటి” త్వరలో రిలీజ్ కానున్నాయి. వీటి విజయాలు ఆమెకు మరిన్ని అవకాశాలను తీసుకొస్తాయనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. అయితే వాటికంటే ముందే నాలుగు సినిమాలు ఆమె చేతిలోకి వచ్చాయి.

ఫిబ్రవరిలో తన కొత్త చిత్రం ‘యూ టర్న్‌’ చిత్రీకరణ మొదలయింది. అలాగే శివ కార్తికేయన్‌కు జోడీగా ‘సీమ రాజా’ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలోని ఓ పాట చిత్రీకరణ కేరళలో జరుగుతోంది. ‘నేను నటిస్తున్న ‘సీమ రాజా’ చిత్రీకరణ పూర్తైంది. ఇది ఇంకా మార్చి నెలే. అయినప్పటికీ 2018 ఇప్పుడే నాకు మంచి అవకాశాలు ఇచ్చింది. చాలా సంతోషంగా ఉంది.’ అని ట్వీట్‌ చేసింది. ఇదే కాకుండా తమిళంలో ‘సూపర్‌ డీలక్స్‌’ సినిమా నాకోసం శ్రమిస్తోంది. ఇక పెళ్లి అయిన తర్వాత తొలిసారి సమంత.. తన భర్త నాగచైతన్యతో కలిసి మరో సినిమాలో నటించబోతున్నారు. శివ నిర్వాణ దర్శకత్వం వహించనున్న ఈ మూవీ వచ్చే నెల మొదలుకాబోతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus