‘నిన్ను కోరి’ తో ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని ప్రేక్షకులకి అందించి సూపర్ హిట్ అందుకున్నాడు దర్శకుడు శివ నిర్వాణ. అటు తర్వాత అతను తెరకెక్కించిన ‘మజిలీ’ కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది. అయితే నానితో రెండో ప్రయత్నంగా చేసిన ‘టక్ జగదీష్’ మాత్రం నెగిటివ్ రెస్పాన్స్ ను మూటకట్టుకుంది. గతేడాది నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ వ్యూయర్ షిప్ బాగానే నమోదైంది.
నిర్మాతకి బాగానే లాభాలు పొందాడు. టి.ఆర్.పి పరంగా కూడా ఓకె అనిపించింది. అయినప్పటికీ దర్శకుడు శివ నిర్వాణ పై నెగిటివ్ మార్క్ అనేది ఉండిపోయింది. దాంతో అతనికి ఇప్పట్లో సినిమా చేయడానికి హీరో దొరకడు అని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే భారీ ప్రాజెక్టు ను సెట్ చేసుకున్నాడతను..! అతనితో కలిసి పనిచేయబోతున్న హీరో మరెవరో కాదు విజయ్ దేవరకొండ. హీరోయిన్ గా సమంత ఫైనల్ అయ్యిందట.
ఇదే భీభత్సమైన కాంబో అనుకుంటే మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుథ్ ఎంపికవ్వడం మరో విశేషంగా చెప్పుకోవాలి. భారీ బడ్జెట్ తో ఈ ప్రాజెక్టుని ఓ బడా నిర్మాణ సంస్థ నిర్మించబోతుందట. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తారు.పాన్ ఇండియా మూవీగా అయితే కాదు కానీ తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో కూడా ఈ మూవీ ఏకకాలంలో తెరకెక్కనుందని తెలుస్తుంది.
విజయ్ దేవరకొండ తన ‘లైగర్’ పూర్తయిన వెంటనే ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి. దీని తర్వాత అతను సుకుమార్ దర్శకత్వంలో ఓ మూవీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈలోపు సుకుమార్.. ‘పుష్ప2’ ని కంప్లీట్ చేస్తాడు.