మొన్నీమధ్య సమంత తన అనారోగ్యం గురించి చెబుతూ.. సెలైన్ పెట్టుకుంటూ డబ్బింగ్ చెబుతున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నానని, ప్రస్తుతం ట్రీట్‌మెంట్ జరుగుతోందని కూడా చెప్పింది. అయితే ఆ సమయంలో అందరికీ ఒకటే డౌట్.. అంత అనారోగ్యంలో ఎందుకు డబ్బింగ్ చెప్పడం అని. వేరే వాళ్లతో డబ్బింగ్ చెప్పించొచ్చు కదా అని. చిన్మయి శ్రీపాద ఎలాగూ ఉన్నారు. ఆమె గతంలో సమంతకు డబ్బింగ్ చెప్పారు కదా అని.
అయితే ఆమె అనారోగ్యంలోనూ డబ్బింగ్ చెప్పడం వెనుక ఏం జరిగిందో ‘యశోద’ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ తెలిపారు. ‘యశోద’ సినిమాకు సంబంధించిన పూర్తి బాధ్యత సమంతనే తీసుకుందట. చిత్రీకరణ సమయంలో ప్రతి విషయాన్నీ స్వయంగా పర్యవేక్షించిందట. ఆమెకి ఆరోగ్యం బాగోలేదనే విషయం ఆమె సోషల్ మీడియాలో పెట్టడానికి కొన్ని రోజుల ముందు, డబ్బింగ్ సమయంలోనే నిర్మాణ సంస్థకు తెలిసిందట. అయితే అప్పటికే తెలుగు డబ్బింగ్ పూర్తయిపోయిందట. తమిళంలో చెప్పే సమయానికి ఆమెలో శక్తి తగ్గిపోయిందట.
దీంతో తమిళ వెర్షన్ కోసం వేరేవాళ్లతో డబ్బింగ్ చెప్పిద్దామని సమంతకు సూచించారట. అయితే సమంత దానికి అంగీకరించలేదట. తన గొంతు తమిళంలో అందరికీ పరిచయమే అని, వేరే వాళ్లతో చెప్పిస్తే బాగుండదని, తానే ముందుకు వచ్చిందట. మూడు, నాలుగు రోజులు వైద్యుల సమక్షంలో, ఒక చేతికి సెలైన్ పెట్టుకుని మరీ తమిళ వెర్షన్ డబ్బింగ్ పూర్తి చేసిందట సమంత. వృత్తి పట్ల ఆమె నిబద్ధతకి అదే నిదర్శనం అని నిర్మాత చెప్పారు. ఇక సినిమా బడ్జెట్ గురించి చెబుతూ..
డైరెక్టర్లు హరి, హరీష్ తనకు కథ చెప్పారని, అందులో చిన్న చిన్న మార్పులు చేయమని సూచించారనని, ఆ తర్వాత సినిమా ఓకే అయ్యిందని చెప్పారు నిర్మాత. నిజానికి మొదట ఈ సినిమాను రూ.3 కోట్ల బడ్జెట్‌లో తెరకెక్కించాలని అనుకున్నారట. అయితే సినిమాలో ప్రధాన పాత్ర కోసం సమంతను అనుకున్నాక బడ్జెట్ పెరిగిపోయిందని చెప్పారు నిర్మాత. అలా సినిమా కోసం మొత్తం రూ.40 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఇక ఈ సినిమా నవంబరు 11న విడుదల కానుంది.
Most Recommended Video
లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!