Samantha: ఖుషి కోసం ఆ హీరోయిన్ రిజెక్ట్ చేయడానికి కారణం అదేనా..!

  • September 2, 2023 / 03:35 PM IST

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ బ్యూటీ క్వీన్ సమంత తొలిసారిగా కలసి నటించిన సినిమా ఖుషి. నిన్ను కోరి, మజిలీ వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన నేడు ప్రపంచ వ్యాప్తంగా కాసేపటి క్రితమే రిలీజ్ అయింది. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఓ వర్గం ప్రేక్షకులు ఈ సినిమా బాగుంది అంటుంటే.. మరో వర్గం వారు మాత్రం ఈ సినిమా టు బోల్డ్ గా ఉందంటున్నారు.

దర్శకుడు శివ నిర్వాణ రియాలిటీని ఉన్నది ఉన్నట్లు చూపించాడన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇది అందరికీ తెలిసిన స్టోరీనే అని పెద్దగా కథనంలో కొత్త దనం లేదన్న కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో విజయ్ సమంత మధ్య రొమాన్స్ కు ప్రేక్షకులు మాత్రం మంచి మార్కులే వేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో మొదటగా సమంతను (Samantha) కాకుండా వేరే వారిని హీరోయిన్ గా అనుకున్నాడట దర్శకుడు శివ నిర్వాణ.

తనెవరో కాదు విజయ్ గర్ల్ ఫ్రెండ్ గా ప్రచారం జరుగుతున్న రష్మిక మందన్నా. కథను రెడీ చేసేటప్పుడే శివ నిర్వాణ హీరోగా విజయ్ దేవరకొండ, హీరోయిన్ గా రష్మిక అని ఫిక్స్ అయ్యారట. కానీ ఇప్పటికే రష్మిక మందన్నా.. విజయ్ దేవరకొండ కలిసి చాలా సినిమాల్లో నటించడంతో.. మళ్లీ ఈ జోడీనే వెండి తెరపై చూపిస్తే ప్రేక్షకులు బోరుగా ఫీలవుతారేమోనని శివ భావించాడట. దీంతో కాంట్రవర్షియల్ బ్యూటీని ఈ రోల్ లో పెడితే కచ్చితంగా సినిమాకి హైప్ వస్తుందని ఆలోచించారట డైరెక్టర్ శివ నిర్వాణ.

దీంతో టాక్ ఆఫ్ ది టౌన్ అయిన సమంతను తీసుకుంటే ఈ పాత్రకు న్యాయం చేయగలదని గట్టిగా నమ్మారట. వెంటనే ఆమెతో ఉన్న ఫ్రెండ్షిప్ కొద్దీ వెళ్లి ఖుషి కథను వివరించారట. మొదట చేసేందుకు సంకోచించినా తర్వాత హీరో విజయ్ దేవరకొండ ఫోన్ చేసిన మాట్లాడిన తర్వాత సినిమాను ఓకే చేసిందట సమంత. అలా ఖుషి సినిమా రష్మిక ఖాతా నుంచి సమంత ఖాతాలో వచ్చి చేరింది.

ఖుషి సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!
బిగ్ బాస్ సీజన్ – 7 ఎలా ఉండబోతోందో తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus