Samantha: సమంత ఫ్యాన్స్‌కి షాక్‌.. ఆ బ్లాక్‌బస్టర్‌ వెబ్‌సిరీస్‌ ఇక రాదు!

తీసిన సినిమానే ఇతర భాషల్లో మళ్లీ తీయడాన్ని రీమేక్‌ అని అంటారు. ఆ సినిమా రెండు చోట్లా బాగా ఆడితే.. ఇతర భాషలు కూడా రీమేక్‌ చేస్తూ ఉంటాయి. ఇక తీసిన వెబ్‌సిరీస్‌నే మళ్లీ మళ్లీ ఇతర భాషల్లో తీయడాన్ని ఏమంటారు? ‘సిటడెల్‌’ అని అంటారు. అవును అలానే ఉంటారు. లేకపోతే మీరే చూడండి. రెండు భాషల్లో దాదాపు ఒకేలాంటి కంటెంట్‌ లేకపోయినా.. అదే పేరుతో వివిధ భాషల్లో తెరకెక్కిస్తూ వస్తున్నారు. అదృష్టం ఏంటంటే.. అన్ని చోట్లా విజయం అయితే మంచిగానే అందుతోంది.

Samantha

అయితే, ఏమైందో ఏమో ‘సిటడెల్’ సిరీస్‌ సీక్వెల్స్‌ అన్నింటిని మెర్జ్‌ చేసేశారు. ఇది సమంత (Samantha) ఫ్యాన్స్‌కి పెద్ద షాకే అని చెప్పాలి. ఇంటర్నేషన్‌ బ్రాండ్ వెబ్‌సిరీస్‌లో మా సమంత నటిస్తోంది అంటూ ఫ్యాన్స్‌ చాలా సంబరంగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ‘సిటడెల్‌ 2: హనీ బన్నీ’ ఇక లేదు అని తేల్చేశారు. వరుణ్‌ ధావన్‌ (Varun Dhawan) , సమంత జంటగా ‘సిటడెల్‌: హనీ బన్నీ’ వెబ్‌సిరీస్‌ చేసిన విషయం తెలిసిందే.

ప్రియాంక చోప్రా (Priyanka Chopra)  , రిచర్డ్‌ మ్యాడెన్‌ నటించిన ‘సిటడెల్‌’ వెబ్‌ సిరీస్‌కి ఇది ఇండియన్‌ వెర్షన్‌. అలాగే ‘సిటడెల్‌: డయానా’ అనే ఇటాలియన్‌ వెర్షన్‌ కూడా వచ్చింది. ఇప్పుడు మూడు వెబ్‌సిరీస్‌ల సీక్వెల్స్‌ని కలిపి ఒకటే ‘సిటడెల్‌ 2’గా రూపొందిస్తారట. ఈ సిరీస్‌ అన్ని భాషల్లోనూ మంచి విజయం అందుకుంది. అందుకే మాతృకను మరింత గొప్పగా సిద్ధం చేసేందుకు ఈ మెర్జ్‌ నిర్ణయం తీసుకున్నాం అని అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో టీమ్‌ తెలిపింది.

‘సిటడెల్‌ 2’ను 2026లో స్ట్రీమింగ్‌కి తీసుకొస్తామని కూడా చెప్పారు. యాక్షన్‌ నేపథ్యంలో ఈ వెబ్‌సిరీస్‌ సిద్ధం చేశారు. అయితే మేకర్స్‌ ‘సిటడెల్‌ 2’ను సినిమాగా తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు గతంలో వరుణ్‌ ధావన్‌ ఒకసారి చెప్పాడు. మరిప్పుడు ఇంటర్నేషనల్‌ వెర్షన్‌ సిరీస్‌గా వస్తుందా? లేక సినిమాగా వస్తుందా అనే విషయం తేలాల్సి ఉంది. చూద్దాం మరో ప్రకటన ఏమన్నా చేస్తారేమో.

మార్క్‌ శంకర్‌పై కామెంట్లు.. అరెస్టయిన స్టార్‌ హీరో అభిమాని!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus