సౌత్ స్టార్ సమంత వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్‌లో పెడుతూ.. తెలుగు, తమిళ్‌తో పాటు హిందీ, ఇంగ్లీష్ భాషల్లోనూ నటించనుంది. ‘ది ఫ్యామిలీ మెన్ 2’ సిరీస్‌తో పాటు ‘పుష్ప’ లో స్పెషల్ సాాంగ్ ద్వారా నార్త్ ఆడియన్స్‌ని ఆకట్టుకున్న సామ్.. హిందీ ఇండస్ట్రీకి సాలిడ్ ఎంట్రీ ఇవ్వాలని ఆఫ్ స్క్రీన్ గట్టి ప్రయత్నాలే చేస్తోంది అనుకుంటుండగా.. పాన్ ఇండియా ఫిల్మ్‌తో షాక్ ఇచ్చింది. ఇప్పుడు సామ్ తన కెరీర్లో మరో బిగ్ స్టెప్ వెయ్యబోతుంది.
ఫస్ట్ టైం పాన్ ఇండియా స్థాయిలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న థ్రిల్లర్ ‘యశోద’.. శ్రీదేవి మూవీస్ బ్యానర్ మీద సీనియర్ ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తుండగా.. హరి – హరీష్ దర్శకులుగా పరిచయమవుతున్నారు. ఇంతకుముందు రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. రీసెంట్‌గా ‘యశోద’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. తమిళ్ స్టార్ సూర్య, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, వరుణ్ ధావన్, రక్షిత్ శెట్టి ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసి.. టీంకి బెస్ట్ విషెస్ తెలియజేశారు.
ట్రైలర్ విషయానికొస్తే.. సరోగసీ నేపథ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కినట్లు రివీల్ చేశారు. సామ్ ఛాలెంజింగ్ క్యారెక్టర్‌లో కనిపించనుంది. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో రూపొందిన ‘యశోద’ ప్రేక్షకులను థ్రిల్ కలిగిస్తుందని హింట్ ఇచ్చారు. సామ్ మరోసారి తన పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకోనుందని అర్థమవుతోంది. యాక్షన్ సీన్స్‌లో చాలా బాగా చేసిందామె. ట్రైలర్ ఆసక్తికరంగా అనిపించడంతో పాటు సినిమా మీద అంచనాలను పెంచేసింది. ఎమ్.సుకుమార్ విజువల్స్, మెలోడి బ్రహ్మ మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ హైలెట్‌గా నిలిచాయి.
ట్రైలర్ చివర్లో ‘‘యశోద ఎవరో తెలుసు కదా.. ఆ కృష్ణ పరమాత్ముణ్ణి పెంచిన తల్లి’’ అనే డైలాగ్ ఆకట్టుకుంటుంది. వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ కీలకపాత్రల్లో నటించిన ‘యశోద’ నవంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. మెయిన్ లీడ్‌గా ఫస్ట్ టైం పాన్ ఇండియా చేస్తుండడంతో ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారోనని రిజల్ట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తోంది సామ్. 2021 డిసెంబర్‌లో షూటింగ్ స్టార్ట్ చేశారు. సెవెన్ స్టార్ హోటల్ కోసం రామానాయుడు స్టూడియోస్‌లో మూడు కోట్లతో భారీ సెట్ వేశారు.
ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!