‘ఏమైంది ఈవేళ’ అనే డిఫరెంట్ లవ్ స్టోరీని తెరకెక్కించి తర్వాత ఎవ్వరూ ఊహించని విధంగా రాంచరణ్ తో ‘రచ్చ’ అనే మాస్ మూవీని చేసి టాప్ డైరెక్టర్ల లిస్ట్ లో చేరిపోయాడు దర్శకుడు సంపత్ నంది. ఈ క్రమంలో ‘బెంగాల్ టైగర్’ ‘గౌతమ్ నంద’ వంటి మాస్ అప్పీల్ ఉన్న మూవీస్ ను చేసి తన ఇమేజ్ ను మరింతగా పెంచుకున్నాడు. అతని నుండీ రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘సీటీమార్’. సెప్టెంబర్ 10న(రేపు) వినాయక చవితి కానుకగా ఈ మూవీ థియేటర్లలో విడుదల కాబోతుంది. ఇక ప్రమోషన్లలో భాగంగా ఆయన ఫిల్మీ ఫోకస్ తో ముచ్చటించి ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. ఆ ముచ్చట్లు మీకోసం :
ప్ర.’సీటీమార్’ ప్రయాణం ఎలా మొదలైంది?
జ. మొదట విద్యా వ్యవస్థ పై ఓ కథ అనుకున్నాను. దాంతో పాటు కబడ్డీ నేపథ్యంలో కూడా ఓ కథ అనుకున్నాను. గోపీచంద్ గారికి రెండూ వినిపించాను. ఆయనకి కబడ్డీ నేపథ్యంతో కూడుకున్న కథ నచ్చింది. అదే ‘సీటీమార్’.
ప్ర.ట్రైలర్ కు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది అనుకుంటున్నారు?
జ. మేము ఊహించిన దానికంటే కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
ప్ర.ప్రస్తుతం ఏ.పి లో 3 షోలే పడుతున్నాయి.. టికెట్ రేట్లు కూడా తక్కువ. ఏ ధైర్యంతో ముందడుగు వేస్తున్నారు?
జ. ప్రేక్షకులు సినిమా బాగుంటే… సినిమా చూడడానికి వస్తారు.. చూస్తారు అనేది మా ధైర్యం. బయట ఎలాంటి పరిస్థితు ఉన్నాయో అందరికీ తెలుసు.. కానీ సినిమా బాగుంటే జనాలు కచ్చితంగా థియేటర్ వరకు అనేది మా బలమైన నమ్మకం.మా సినిమాకి జనాలు రావాలని ఇండస్ట్రీలో ఉన్న ప్రతీ ఒక్కరూ కోరుకుంటున్నారు. వినాయక చవితి రోజున ఆ విఘ్నాలన్నీ తొలగిపోతాయి అని మేము భావిస్తున్నాం.
ప్ర.ఓటిటి ఆఫర్లు కూడా ఎక్కువే వచ్చాయి అని విన్నాం?
జ. నిజమే.. మా మూవీకి మంచి ఓటిటి ఆఫర్లే వచ్చాయి. కానీ ఇది థియేటర్లో చూడాల్సిన సినిమా. ప్రేక్షకుడు థియేటర్లో చూస్తేనే ఎంజాయ్ చేయగలడు. అందుకే మేము ఈ స్టెప్ తీసుకున్నాం.
ప్ర.తమన్నా గారిని ఈ మూవీలో హీరోయిన్ గా తీసుకోవడం వెనుక.. హిట్ సెంటిమెంటేనా?
జ.సెంటిమెంట్ ప్రకారం కాదండీ..!ఓ కోచ్ పాత్రకి ఫిట్ గా యాక్టివ్ గా ఉండే వాళ్ళు కావాలి… కాబట్టి నా మైండ్లోకి తమన్నా గారే వచ్చారు. అందుకే ఆమెనే ఎంపిక చేసుకున్నాం. అంతేకాకుండా నా గత మూడు చిత్రాల్లో కెమెరామెన్ కూడా మారలేదు. దాని గురించి మాత్రం ఎవ్వరూ అడగడం లేదు.. హీరోయిన్ గురించే అడుగుతున్నారు(నవ్వుతూ)
ప్ర.మీ కాంబినేషన్లో గతంలో ‘గౌతమ్ నంద’ మూవీ వచ్చింది. దాని ఫలితాన్ని మీరు ఎలా తీసుకుంటారు?
జ. ఆ సినిమాకి జనాల నుండీ పాజిటివ్ రెస్పాన్సే వచ్చిందండీ. చాలా మంది నాకు ఆ సినిమా అంటే ఇష్టం అని చెప్పినవాళ్ళు ఉన్నారు.కానీ కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. కానీ ‘సీటీమార్’ ఫలితం పై మాత్రం గోపిగారు, నేను ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాం.
ప్ర. ‘సీటీమార్’ మూవీకి రామ్ గారిని, రాంచరణ్ గారిని మొదట సంప్రదించారట నిజమేనా?
జ. అందులో నిజం లేదండీ.. నా కథకి కోచ్ అనే అతను హైట్ గా ఫిట్ గా ఉండాలి. కాబట్టి నా మైండ్లో గోపిచంద్ గారే వచ్చారు. ఆయన్నే సంప్రదించాను. ఆయనతోనే సెట్స్ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్ళాను.
ప్ర.’గాడ్ ఫాథర్’ అనే టైటిల్ ను మీరు చిరంజీవి గారి మూవీకి ఇచ్చారు అని వార్తలు వచ్చాయి నిజమేనా?
జ. ఈ విషయం గురించి నేను ఇప్పుడు మాట్లాడటం కరెక్ట్ కాదండీ.! కానీ ఒక్క మాట చెప్పదలచుకున్నాను.. చిరంజీవి గారు అడిగితే టైటిల్ ఏంటండీ.. స్టోరీ కూడా ఇచ్చేస్తా. నాకు ఆయన ‘గాడ్ ఫాథర్’ లాంటివారు.
ప్ర.మీ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి?
జ. ప్రస్తుతం నా అసిస్టెంట్ తో ‘సింబా’ అనే మూవీని రూపొందిస్తున్నాను. గత 10 రోజులుగా షూటింగ్ జరుగుతుంది.
ప్ర.’సీటీమార్’ రిలీజ్ రోజునే ‘టక్ జగదీష్’ ఓటిటిలో రిలీజ్ అవుతుంది.దాని ఎఫెక్ట్ మీ మూవీ పై పడుతుంది అనుకుంటున్నారా?
జ. పండగ రోజున రెండు సినిమాలు రిలీజ్ అవ్వొచ్చండి. ప్రేక్షకులు రెండు సినిమాలు చూస్తారు. కాబట్టి మాకు అలాంటి టెన్షన్ ఏమీ లేదు. రెండు మూవీస్ కూడా ప్రేక్షకుల్ని అలరించాలనే కోరుకుంటున్నాను.
ప్ర. ఫైనల్ గా ‘సీటీమార్’ గురించి ఒక్క మాటలో ప్రేక్షకులకు ఏం చెబుతారు?
జ. స్వాతంత్రం రాక ముందే మన లైఫ్ లోకి సినిమా అనేది ఎంటర్ అయ్యింది. అలాంటి ప్రతీకూల పరిస్థితుల్లో కూడా సినిమాని చూసిన వాళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుని జనాలు థియేటర్ కు రావడం కష్టమా.? మన థియేటర్లను మనం కాపాడుకోవాలి. ‘సీటీమార్’ చూడడానికి థియేటర్ కు వచ్చే ప్రతీ ప్రేక్షకుడిని… మా మూవీ సంతృప్తిపరిచి ఇంటికి పంపిస్తుంది. ప్రేక్షకులంతా తగిన జాగ్రత్తలు తీసుకుని థియేటర్ కు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.