Pawan Kalyan: మరోసారి పవన్ కళ్యాణ్ తో సముద్రఖని సినిమా?
- June 8, 2023 / 09:20 PM ISTByFilmy Focus
పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో `బ్రో` అనే చిత్రం రూపొందుతుంది. సముద్రఖని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళంలో ఆయన తీసిన `వినోదయ సీతమ్` చిత్రానికి ‘బ్రో’ రీమేక్ అనే సంగతి తెలిసిందే. షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. ఓ పాట షూట్ చేస్తే షూటింగ్ కంప్లీట్ అయినట్టే. పవన్ కళ్యాణ్ వంటి పెద్ద హీరో సినిమా ఇంత ఫాస్ట్ గా పూర్తి చేయడం అంటే మామూలు విషయం కాదు.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమాలో కనిపించేది తక్కువ సేపే కాబట్టి.. అతని పార్ట్ షూటింగ్ కూడా ఎక్కువ రోజులు పట్టలేదు. ఇక బ్యాలెన్స్ షూటింగ్ ను కూడా త్వరగానే కంప్లీట్ చేసేశాడు సముద్రఖని. ఈ ఒక్క కారణంతో ఫుల్ మర్క్స్ కొట్టేశాడు. ఈరోజుల్లో ఇంత ఫాస్ట్ గా అనుకున్న బడ్జెట్ లో సినిమాని కంప్లీట్ చేయడం అంటే మాటలు కాదు. ఒక్క స్క్రిప్ట్ విషయంలో తప్ప ‘బ్రో’ సినిమాకి అనవసరమైన మేకింగ్ కాస్ట్ అయితే పడలేదు.

అందుకే పవన్ మరోసారి సముద్రఖనికి ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. `బ్రో` విడుదలైన తరవాత.. సముద్రఖనితో మరో సినిమా చేయడానికి పవన్ సిద్ధంగా ఉన్నాడట. సముద్రఖని కూడా మంచి రైటర్. అందుకే ఈసారి రీమేక్ తో కాకుండా ఓ స్ట్రయిట్ కథతో సినిమా చేద్దామని ఓ మాట అనేసాడట. సముద్రఖని కనుక మంచి కథతో పవన్ వద్దకు వెళ్తే..

హ్యాపీగా ఇంకో సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లిపోవచ్చు. పవన్ వంటి హీరో సినిమా ఆఫర్ ఇచ్చాక.. టాలీవుడ్లో మరిన్ని సినిమాలు చేసే ఛాన్స్ కూడా దక్కుతుంది.అప్పుడు నటుడిగానే కాకుండా మళ్ళీ దర్శకుడిగా సముద్రఖని బిజీ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!
టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

















