Samuthirakani: స్టార్ నిర్మాత పై నటుడు సముద్రఖని షాకింగ్ కామెంట్స్..!

తమిళం లో ఎన్నో సినిమాలు మరియు సీరియల్స్ తీసి దర్శకుడిగా మంచి పేరు దక్కించుకున్న స్టార్ నటుడు సముద్ర ఖని, ఆ తర్వాత నటుడిగా మారి ప్రస్తుతం ఏ రేంజ్ డిమాండ్ లో ఉన్నాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఈయన లేని సినిమా అంటూ లేదు, చిన్న సినిమాల దగ్గర నుండి పాన్ ఇండియన్ చిత్రాల వరకు ఇప్పుడు అందరికీ సముద్ర ఖనినే కావాలి. నటుడిగా ఇంత బిజీ జీవితాన్ని గడుపుతున్న సముద్ర ఖని, రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ తో ‘బ్రో ది అవతార్’ చిత్రం తెరకెక్కించిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ సినిమా కమర్షియల్ గా యావరేజి రేంజ్ లో ఆడింది. అలా ఒక పక్క నటుడిగా కొనసాగుతూనే, మరోపక్క దర్శకుడిగా కూడా పలు సినిమాలను తెరకెక్కిస్తూ క్షణ కాలం తీరిక లేకుండా గడుపుతున్నాడు సముద్ర ఖని. అయితే హీరోల దగ్గర నుండి దర్శక నిర్మాతలు మరియు మూవీ ఆర్టిస్టులకు ఎంతో మర్యాద ఇచ్చే సముద్ర ఖని, రీసెంట్ గా ప్రముఖ తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా పై ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతోంది.

అసలు విషయం ఏమిటంటే తమిళ హీరో కార్తీ మొదటి సినిమా ‘పరుత్తివీరన్’ చిత్రం అప్పట్లో పెద్ద హిట్ అయ్యింది. అయితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయం లో తనకి ఎదురైనా కొన్ని సంఘటనలను చెప్పుకొచ్చాడు నిర్మాత జ్ఞానవేల్ రాజా. దీనిపై డైరెక్టర్ అమీర్ అసంతృప్తి వ్యక్తం చేసాడు. అమీర్ కి సపోర్టుగా సముద్రఖని మాట్లాడుతూ ‘ఈ చిత్రం లో నేను కూడా నటించాను.

ఈ సినిమా తీస్తున్న సమయం లో ఒక్కసారి కూడా నువ్వు సెట్స్ కి రాలేదు. పోనీ నిర్మాతగా బడ్జెట్ ఇచ్చావా అంటే అది కూడా లేదు. డైరెక్టర్ అమీర్ తన బంధువుల దగ్గర అప్పులు చేసి ఈ చిత్రాన్ని పూర్తి చేసాడు. నిర్మాతగా మాత్రం సిగ్గు లేకుండా నీ పేరు వేసుకొని, ఈరోజు మళ్ళీ డైరెక్టర్ అని అంటావా.. నీది ఒక బ్రతుకేనా’ అంటూ సముద్ర ఖని (Samuthirakani) చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus