సముద్రఖని దర్శకుడిగా పరిశ్రమలో అడుగుపెట్టి అదరగొట్టి.. ఇప్పుడు నటుడిగానూ మెప్పిస్తున్నారు. వెర్సటైల్ క్యారెక్టర్స్ ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ‘క్రాక్’లో కటారి కృష్ణ పాత్రలో జీవించేశాడు అని అందరూ మెచ్చుకున్నారు. మామూలుగానే మన నటీనటుల జీవితాల్లో కావాల్సినంత సినిమాటిక్ మసాలా ఉంటుంది. అలాంటిది సముద్రఖని జీవితంలో ఇంకెలాంటి విషయాలున్నాయా అని అందరూ ఆసక్తిగా చర్చించుకుంటుంటారు. ఆయన జీవితంలోని ఇంట్రెస్టింగ్ అంశాలు చూసుకుంటే… సినిమాలు చూడటానికి డబ్బుల కోసం, ఆ థియేటర్‌లోనే జంతికలు అమ్మేవారట.
వ్యవసాయం అంటే ప్రాణంపెట్టే సముద్రఖని తండ్రికి సినిమాలంటే అస్సలు నచ్చేవి కావట. దీంతో ఇంట్లో సినిమా చూడటం నిషేధం. ఎంతగా అంటే టీవీలో కూడా సినిమా చూసే పరిస్థితి ఉండేది కాదట. అలాంటిది ఓ రోజు సముద్రఖని స్నేహితుడితో కలసి సినిమా థియేటర్‌కి వెళ్లి శివాజీ గణేశన్ నటించిన ‘ముదల్ మరియాదై’ చూశారట. ఆ తర్వాత వీలు చిక్కినప్పుడల్లా థియేటర్‌లకు వెళ్లి సినిమా చూసేవారట. ఓసారి విషయం తండ్రికి తెలిసిపోయింది.
దీంతో చితకబాదారట. ఇంట్లోవాళ్లెవరూ తనకు డబ్బులు ఇవ్వొద్దని గట్టిగా చెప్పారట. అయినా సముద్రఖని సినిమా ఆసక్తి ఆగలేదు. నిద్రపోవడానికి డాబా మీదికు వెళ్లి.. అలా గోడ దూకేసి, థియేటర్‌కి వెళ్లిపోయేవారట. థియేటర్ గోడపక్కన కూర్చొని డైలాగ్‌లు విని సంతోషించేవారట. అలా అలా డైలాగ్స్ విని రజినీకాంత్‌కి పెద్ద ఫ్యాన్ అయిపోయారట.
Most Recommended Video
ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?