Writer: ‘ఆహా’ లో స్ట్రీమింగ్ కానున్న సముద్రఖని వైవిధ్యమైన మూవీ ‘రైటర్’..!

  • May 25, 2022 / 03:37 PM IST

వైవిధ్యమైన, వినూత్నమైన.. వినోదాత్మకమైన తెలుగు కంటెంట్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ .. వారిని సంతృప్తి పరుస్తుంది ‘ఆహా’. ప్రతీ శుక్రవారం నాడు ఓ కొత్త చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తూ వీకెండ్ కు కావాల్సిన మజానిస్తుంది. అదే క్రమంలో తమిళంలో సముద్ర ఖని ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘రైటర్’ చిత్రాన్ని డబ్ చేసి తెలుగు ప్రేక్షకులకు అందించబోతుంది. గతేడాది తమిళంలో విడుదలైన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. మే 27 నుండీ ఈ మూవీ ‘ఆహా’ స్ట్రీమింగ్ కానుంది.

ఓ పోలీస్ స్టేషన్లో రైటర్ గా పనిచేసే సముద్రఖని.. ఎంతో సిన్సియర్ గా ప్రతి కేసుకి సంబంధించిన ఫైల్ ను బద్రపరుస్తూ ఉంటాడు. ఇతని పనితనాన్ని ఆ స్టేషన్లో పనిచేసే వాళ్ళందరూ ఇష్టపడుతుంటారు. మరో పక్క అతను తన ఫ్యామిలీతో ఎంతో ఆనందంగా జీవిస్తూ ఉంటాడు ఈ రైటర్. అయితే ఇంతలో ఓ పి.హెచ్.డి స్టూడెంట్ ను అన్యాయంగా ఓ కేసులో ఇరికించారు అనే సంగతి రైటర్ సముద్రఖని కనిపెడతాడు. ఆ కేసు నుండీ అతన్ని బయటపడేయాలని ప్రయత్నాలు మొదలెడతాడు.

మరి ఆ కేసు నుండీ ఆ కుర్రాడిని అతను ఎలా బయటపడేసాడు? అసలు ఆ కుర్రాడిని ఎందుకు అన్యాయంగా కేసులో ఇరికించారు? అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఫ్రాంక్లిన్ జాకబ్ ఈ చిత్రానికి దర్శకుడు. తమిళ క్రేజీ దర్శకులలో ఒకరైన పా.రంజిత్ ఈ చిత్రానికి సమర్పకులు గా వ్యవహరించడం విశేషం. అంతేకాదు ప్రఖ్యాత ఐ.ఎం.డి.బి సంస్థ ఈ చిత్రానికి ఏకంగా 8/10 రేటింగ్ ను ఇవ్వడంతో ఈ చిత్రం చూడాలనే ఆసక్తి చాలా మంది ప్రేక్షకుల్లో పెరిగింది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus