Samyuktha Menon: అమ్మను సెట్స్‌కి తీసుకెళ్లను అంటున్న సంయుక్త.. లాజిక్‌ సూపర్‌!

టాలీవుడ్‌ హీరోయిన్‌ కానీ, బాలీవుడ్‌ హీరోయిన్‌ కానీ.. సినిమా సెట్స్‌కు వచ్చింది అంటే ఆమెతోపాటు వాళ్ల మదర్‌ కచ్చితంగా ఉంటారు అని అంటుంటారు. ఈ మధ్య కాలంలో కాస్త తగ్గింది అని అంటున్నారు కానీ.. ఒక ఐదారేళ్ల క్రితం వరకు ఇదే పరిస్థితి. హీరోయిన్‌తోపాటు ఆమె మదర్‌కి కూడా కుర్చీ, ఏర్పాట్లు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చేవి. అయితే ఇలాంటి వాటికి టాలీవుడ్‌ లేటెస్ట్‌ గోల్డెన్‌ లెగ్‌ సంయుక్త మేనన్‌ దూరం. ఈ విషయాన్ని ఆమెనే చెప్పుకొచ్చింది.

మీ సినిమాల ఎంపిక, సెట్స్‌ సంగతేంటి, అమ్మతో అన్నీ డిస్కస్‌ చేస్తారా అని అడిగితే.. అమ్మతో సినిమా కథలూ, రెమ్యునరేషన్‌ గురించీ చర్చించను అని చెప్పింది. అంతేకాదు తనతోపాటు సెట్స్‌కి కూడా తీసుకెళ్లను అని కూడా చెప్పింది. తల్లీ కూతుళ్ల మధ్య అనుబంధం వేరు… అయితే అందులో ప్రొఫెషనల్‌ లైఫ్‌ను తీసుకురావడం తనకు నచ్చదట. అందుకే సినిమాలు, సెట్స్‌కి తల్లిని ఇన్వాల్వ్‌ చేయను అని చెబుతోంది. అంతేకాదు దాని కోసం ఓ లాజిక్‌ కూడా చెప్పింది.

ఒకవేళ పిల్లలు డాక్టర్లూ, ఇంజినీర్లూ అయితే వారి వృత్తిలో తల్లిదండ్రులు తలదూర్చరు కదా. అలాగే సినిమా వాళ్ల విషయంలోనూ ఆలోచించాలి. అందుకే తాను సినిమా సెట్స్‌కు, సినిమాల ఎంపికకు తన తల్లిని ఇన్వాల్వ్‌ చేయను అని చెప్పింది సంయుక్త. తను చిన్నతనం నుండి ఇలా ఇండివిడ్యువల్‌గానే పెరిగిందట. అందుకే ఆ మనస్తత్వం అలవడింది అని చెప్పుకొచ్చింది. అయితే తాను ఎప్పుడైనా దిగులుగా ఉన్నప్పుడు ‘స్ట్రాంగ్‌ పర్సన్‌ డల్‌గా కనిపిస్తున్నారు. ఏంటి విషయం’ అని వాళ్ల అమ్మ దగ్గరకు తీసుకుంటుందట.

ఇక సినిమాల సంగతి చూస్తే… ప్రస్తుతం (Samyuktha Menon) సంయుక్త చేతిలో కల్యాణ్‌ రామ్‌ ‘డెవిల్‌’ ఒక్కటే ఉంది. మరికొన్ని సినిమాలు డిస్కషన్‌ స్టేజీలో ఉన్నాయి అని సమాచారం. కరోనాకు ముందు వరుసగా సినిమాలు అంగీకరించి.. అన్నీ పూర్తి చేసి ఇప్పుడు రిలీజ్‌ అవుతున్నాయి. మరి కొత్త సినిమాలు ఎప్పుడు తెలుస్తాయో చూడాలి.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus