Samyuktha Menon: ‘డెవిల్‌’ తర్వాత ఆ హీరోయిన్‌ను మళ్లీ చూడలేమా?

చేసిన సినిమాలన్నీ హిట్లు కొడితే ఆ హీరోయిన్‌ గోల్డెన్‌ లెగ్‌ అని అంటుంటారు. దీనికి పర్యాయ పదంగా సంయుక్త అని కూడా అనొచ్చు. ఏంటి అతిశయోక్తిలా ఉందే అనుకుంటున్నారా? కావాలంటే ఆమె సినిమాల లిస్ట్‌ చూడండి మీకే అసలు విషయం అర్థమైపోతుంది. ఆ విషయం తర్వాత చూద్దాం. ఇప్పుడు లేటెస్ట్‌ టాపిక్‌ అయితే మాత్రం ‘సంయుక్త సినిమాలకు దూరమవుతోందా?’. అవును ఇదే లేటెస్ట్‌ అండ్‌ హాటెస్ట్‌ సోషల్‌ మీడియాల చర్చ.

‘సార్‌’, ‘భీమ్లా నాయ‌క్’, ‘విరూపాక్ష‌’ సినిమాలతో వరుస విజయాలు అందుకుంది సంయుక్త. దీంతో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కూడా భారీగా పెరిగిపోయంది. ఓ స్టార్‌ దర్శకుడి అండదండగల వల్లే అన్ని సినిమాలు వచ్చాయి అనే టాక్‌ కూడా మొదలైంది. అయితే ఇప్పుడు ఆమె సినిమాల నుండి తప్పుకుంటోంది అని చర్చ మొదలైంది. దానికి కారణం ఆమె ఇంకా ఏ కొత్త సినిమాలు ఓకే చేయకపోవడం, అలాగే కేరళ నుండి వస్తున్న లీకులు. రేపు విడుదలవుతున్న ‘డెవిల్‌’ సినిమానే ఆమె ప్రస్తుత సీజన్‌లో ఆఖరి సినిమా అంటున్నారు.

ఇలాంటి టాక్‌ రావడానికి కారణం… సంయుక్త పెళ్లి కుదిరింద‌నే పుకారు. త‌ను ఓ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకోబోతోంద‌ని, పెళ్ల‌య్యాక సినిమాల‌కు దూరం కానుంది అనేది ఆ పుకార్ల సారాంశం. పెళ్ల‌య్యాక సినిమాలు చేయ‌కూడ‌ద‌ని అత్తారింటి వారు కండీష‌న్ పెట్టార‌ట‌. దీంతో ఆమె సినిమాలకు దూరమవ్వనుందని చెబుతున్నారు. అయితే ఈ విషయంలో ఆమెకు సోషల్ మీడియా వేదికగా చాలా ప్రశ్నలు వస్తున్నాయి. మరి వీటిపై ఆమె ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి.

ఎప్పుడో ఏడేళ్ల క్రితం సినిమా హీరోయిన్‌గా కెరీర్‌ ప్రారంభించింది (Samyuktha Menon) సంయుక్త. 2016లో వచ్చిన ‘పాప్‌కార్న్‌’ అనే మలయాళ సినిమా ఆమె ఫస్ట్‌ ప్రాజెక్ట్‌. అక్కడికి ఆరేళ్లకు తెలుగులోకి వచ్చింది. వచ్చీ రావడం వరుసగా పెద్ద సినిమాలు చేస్తూ వచ్చింది. అయితే ఏమైందో ఏమో ఇటీవల కాలంలో అస్సలు కొత్త సినిమాలు ఓకే చేయడం లేదు. 2024 డైరీలో ఆమె డేట్స్‌ అన్నీ ఖాళీనే అట. అందుకే పెళ్లి పుకార్లు వస్తున్నాయి.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus