ఇప్పటికే టాలీవుడ్ లో చాలా మంది మలయాళీ ముద్దుగుమ్మలు ఆఫర్లు దక్కించుకుంటున్నారు. ఈ కేరళ హీరోయిన్స్ ను తెలుగు ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు. ఇప్పుడు మరో మలయాళీ హీరోయిన్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతుంది. పాతికేళ్ల సంయుక్త మీనన్ కు మెగాహీరో సాయి ధరమ్ తేజ్ సరసన నటించే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో నటించిన సంయుక్త టాలీవుడ్ కు రాబోతుంది.
నిజానికి తెలుగులో ఆమెకిది రెండో సినిమా. రీసెంట్ గానే కళ్యాణ్ రామ్ సరసన ఓ సినిమాలో నటించడానికి ఒప్పుకుంది. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ తో రొమాన్స్ కు రెడీ అయింది. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై భోగవల్లి ప్రసాద్ నిర్మాతగా సాయి ధరమ్ తేజ్ ఓ సినిమా చేయబోతున్నారు. ఇందులో హీరోయిన్ గా సంయుక్తను ఫైనల్ చేశారు.
గతేడాది ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తేజు ప్రస్తుతం రిపబ్లిక్ సినిమాలో నటిస్తున్నారు. దేవాకట్టా డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇటీవలే ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తరువాత సుకుమార్ రైటింగ్స్ లో సినిమా మొదలుపెట్టనున్నారు. ఆ తరువాత దిల్ రాజు బ్యానర్ లో మరో సినిమా చేయాల్సివుంది!