Ravi Teja: రవితేజపై ‘కలర్ ఫోటో’ దర్శకుడు సందీప్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

యూట్యూబ్ లో చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ పాపులర్ అయ్యాడు సందీప్ రాజ్. డైరెక్టర్ గానే కాకుండా నటుడిగా కూడా ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ‘కలర్ ఫోటో’ సినిమాతో కంప్లీట్ డైరెక్టర్ గా మారాడు. దానికి నేషనల్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. తర్వాత సందీప్ కి వరుసగా ఆఫర్లు వచ్చాయి. మధ్యలో రవితేజతో సినిమా ఆల్మోస్ట్ ఫిక్స్ అన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల అది సెట్ అవ్వలేదు.

Ravi Teja

ప్రస్తుతం నటుడిగా ‘డాకు మహారాజ్’ ‘భైరవం’ వంటి సినిమాల్లో నటిస్తూనే మరోపక్క సుమ కొడుకు రోషన్ తో ‘మోగ్లీ’ అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ .. రవితేజ గురించి ఆసక్తికర విషయాలు తెలిపాడు. సందీప్ రాజ్ మాట్లాడుతూ.. “నేను ఏ హీరో దగ్గరికి వెళ్లినా వాళ్ళ మార్కెట్ ను మించిన కథ రాసుకుని వెళ్తున్నాను. అందువల్ల బడ్జెట్ ఎక్కువవుతుంది.

అందువల్ల అది సెట్ అవ్వడం లేదు. నేను రవితేజ గారితో ట్రావెల్ అయ్యాను. ఆయనకు ఓ కథ చెప్పాను. అది ఆయనకు నచ్చింది. కానీ ఆయన వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఈ సంవత్సరం కూడా బిజీగా ఉన్నారు. మధ్యలో ఆయన ‘నీ గోల్డెన్ పీరియడ్ అంతా వేస్ట్ చేసుకుంటున్నావ్.. నాకు మరో 2 కమిట్మెంట్స్ ఉన్నాయి.. అర్థం చేసుకో’ అన్నారు. దీంతో ‘సార్ నాకు కూడా 3 ఇయర్స్ అయిపోయింది.

అయితే నాకు ఓ ఆఫర్ ఉంది’ అని చెప్పాను. అప్పుడు ఆయన ‘వెరీ గుడ్.. వెళ్లి ఆ సినిమా చేసుకుని రా.. కానీ నాకు చెప్పిన కథ వేరే వాళ్ళతో తీయకు చంపేస్తాను’ అని వార్నింగ్ ఇచ్చారు. ‘సార్.. అది మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని తీసిన కథ సార్ అది.. వేరే వాళ్ళతో చేయలేను’ అని అన్నాను. అలా నేను ‘మోగ్లీ’ చేస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.

విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించిన మరో నటి.. షాకింగ్ ఇది!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus