ఈ మధ్య సెలబ్రిటీల విడాకులు వార్తలు ఎక్కువగా వింటూ వస్తున్నాం. వర్క్ లైఫ్ ను.. ఫ్యామిలీ లైఫ్ ను బ్యాలెన్స్ చేయలేక చాలా మంది సెలబ్రిటీలు విడాకుల బాట పడుతున్నారు. నాగ చైతన్య – సమంత నుండి చాలా మంది సెలబ్రిటీ కపుల్స్ విడాకులు తీసుకోవడం చూశాం. ఇది ఎంత గ్లామర్ ఫీల్డ్ అయినప్పటికీ జనాల అటెన్షన్ ఎక్కువగా ఉన్న ఫీల్డ్ కూడా కాబట్టి.. సోషల్ మీడియాలో విడాకుల విషయంలో కూడా ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది.
ఈ క్రమంలో మరో నటి విడాకులు తీసుకున్నట్లు ప్రకటించి హాట్ టాపిక్ అయ్యింది. అవును ఓ సీరియల్ నటి కూడా విడాకులకు రెడీ అయ్యింది. పెళ్ళైన 22 ఏళ్ల తర్వాత తన కాపురానికి స్వస్తి చెప్పనుంది. ఆమె మరెవరో కాదు పల్లవి రావు. హిందీ సీరియల్స్ తో ఈమె బాగా పాపులర్. ‘పాండ్యా స్టోర్’ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న పల్లవి తర్వాత ‘పునర్ వివాహ ఏక్ నయీ ఉమ్మీద్’ ‘మెయిన్ లక్ష్మీ తేరే అంగన్ కీ’ ‘యహాన్ మే ఘర్ ఘర్ ఖేలీ’ ‘బిట్టో’ ‘కహానీ హుమారే’ ‘మహాభారత్ కీ’ వంటి సీరియల్స్ తో కూడా మెప్పించింది.
అలాగే పలు యాడ్స్ లో కూడా నటించింది. ఈమె పర్సనల్ లైఫ్ కూడా చాలా మందికి తెలిసిందే. దర్శకుడు సూరజ్ రావుని ప్రేమ వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు ఓ కూతురు, కొడుకు సంతానం. కూతురు వయసు 21 ఏళ్ళు. అంటే ఆమె పెళ్ళీడుకొచ్చినట్టే. ఇలాంటి టైంలో పల్లవి -సూరజ్ విడాకులు ప్రకటించడం అందరికీ షాకిచ్చింది.