Sandeep Reddy Vanga: రాజమౌళి – మహేష్.. వర్క్ లో సందీప్ వంగా కూడా!

దర్శక దిగ్గజం రాజమౌళి  (S. S. Rajamouli) , సూపర్ స్టార్ మహేష్ బాబుతో (Mahesh Babu)  చేస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘SSMB29’పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 1000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అవుతుందని సినీ వర్గాల్లో టాక్. ప్రీప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి, అలాగే ఇందులో హాలీవుడ్ నటులు కూడా పాల్గొనబోతున్నారని సమాచారం. మహేష్ బాబు ఈ సినిమాలో తన పాత్ర కోసం ప్రత్యేకంగా లుక్‌ని మార్చేశారు, ఇంకా వర్క్ షాప్‌లో కూడా పాల్గొంటున్నారు.

Sandeep Reddy Vanga

ఇదిలా ఉంటే సందీప్ వంగా (Sandeep Reddy Vanga)  కూడా షూట్ లో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ (RRR) ప్రమోషనల్ ఇంటర్వ్యూలో సందీప్, రాజమౌళితో వర్క్ చేయాలనే ఆశను వ్యక్తం చేశారు. రాజమౌళి శైలిలో పాఠాలు నేర్చుకోవడానికి కనీసం 20-25 రోజులు మీ షూటింగ్‌ను అబ్జర్వ్ చేయాలని సందీప్ రెడ్డి ఆ ఇంటర్వ్యూలో రిక్వెస్ట్ చేశారు. దీనికి రాజమౌళి కూడా ఒకే చెప్పడం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇప్పుడు సందీప్ రెడ్డి ‘SSMB29’ షూటింగ్‌కు హాజరయ్యే అవకాశాలపై సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ రాజమౌళి తన రిక్వెస్ట్‌ని గుర్తుపెట్టుకొని ‘SSMB29’ షూటింగ్‌కు సందీప్ రెడ్డిని పిలిస్తే మాత్రం ఇది ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు కారణం, మహేష్ బాబుకి సందీప్‌తో మంచి సన్నిహిత సంబంధాలు ఉండడమే.

కానీ సందీప్ రెడ్డి ప్రస్తుతం ‘స్పిరిట్’ మూవీ ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్నారు. ప్రభాస్‌తో చేస్తున్న ఈ ప్రాజెక్ట్ భారీ అంచనాల నడుమ రూపొందుతోంది. ఈ స‌మయంలో ‘SSMB29’ షూటింగ్‌కు హాజరుకావడం సాధ్యమవుతుందా అనే ప్రశ్న కూడా సినీ వర్గాల్లో వినిపిస్తోంది. మొత్తానికి రాజమౌళి, మహేష్ బాబుతో కలిసి సందీప్ రెడ్డి వంగా వర్క్ చేసే అవకాశం రానున్న రోజుల్లో కచ్చితంగా వార్తల్లో నిలుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.

స్టార్ హీరో కొడుకుపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus