Sandeep Reddy Vanga: ఆ హీరోలకు నేషనల్ అవార్డ్ ఎందుకు రాలేదు?

అర్జున్ రెడ్డి సినిమా ద్వారా సెన్సేషనల్ డైరెక్టర్ గా మారినటువంటి సందీప్ రెడ్డి త్వరలోనే యానిమల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా డిసెంబర్ ఒకటవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సందీప్ రెడ్డి నేషనల్ అవార్డ్స్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 69వ నేషనల్ అవార్డ్స్ లో భాగంగా ఉత్తమ జాతీయ నటుడిగా అల్లు అర్జున్ అవార్డు అందుకున్న సంగతి మనకు తెలిసిందే

ఇలా మొట్టమొదటి నేషనల్ అవార్డు అందుకున్నటువంటి తెలుగు హీరోగా అల్లు అర్జున్ రికార్డ్ సృష్టించారు. అంతేకాకుండా ఈ 69 సంవత్సరాల కాలంలో ఏ తెలుగు హీరోకి ఈ నేషనల్ అవార్డు రాకపోవడానికి కారణం ఏంటి అంటూ ఈయన సందేహాలను వ్యక్తం చేశారు. బహుశా ఈ నేషనల్ అవార్డ్స్ గురించి మన టాలీవుడ్ హీరోలు పెద్దగా ఆసక్తి చూపించకపోయి ఉండొచ్చని లేదంటే అవార్డులకి అప్లై చేసుకునే విధానంలో పొరపాట్లు కూడా జరిగే ఉండవచ్చని

ఈ సందర్భంగా సందీప్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి . ఇక సందీప్ రెడ్డి అర్జున్ రెడ్డి సినిమా తర్వాత యానిమల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా తర్వాత ఈయన ప్రభాస్ హీరోగా స్పిరిట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సెప్టెంబర్ నుంచి షూటింగ్ పనులు జరుపుకోబోతుందని 2025 వ సంవత్సరంలో విడుదల కాబోతుందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తో కూడా సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నటువంటి అల్లు అర్జున్ ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో బిజీగా ఉన్నారు త్రివిక్రమ్ సినిమా పూర్తి కాగానే (Sandeep Reddy Vanga) సందీప్ రెడ్డి డైరెక్షన్లో నటించబోతున్నారు.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus