Sandeep Reddy Vanga: మహేష్ అంటే చాలా స్పెషల్.. ఎందుకంటే: సందీప్

టాలీవుడ్‌ దర్శకుల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించిన వారిలో సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) టాప్ లిస్టులో ఉంటారని చెప్పవచ్చు. తన కథలు, డైరెక్షన్‌తో ఒక సరికొత్త ట్రెండ్ ను సృష్టించాడు. తాజాగా ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు  (Mahesh Babu) గురించి చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఇండస్ట్రీలో చాలా మంది మహేష్‌ను తెరపై చూస్తూ అభిమానిస్తారు. కానీ ఆయన అసలు ప్రత్యేకత తెర వెనుకే ఉంటుందని సందీప్ వంగా అంటున్నారు.

Sandeep Reddy Vanga

“మహేష్ బాబు చాలా స్పెషల్ వ్యక్తి అని నాకిప్పటికి అర్థమైంది. అతని వ్యక్తిత్వం తెరపై మనం చూస్తున్న దానికంటే 75% ఎక్కువ గొప్పదై ఉంటుంది. ఒక్క చిన్న హావభావం నుండి అతని శరీర భాష వరకు ప్రతీదీ ఎనర్జీతో నిండిపోయి ఉంటుంది,” అని సందీప్ తన అనుభవాన్ని పంచుకున్నారు. మహేష్‌కి సంబంధించిన ఓ యాడ్‌ షూట్‌లో పని చేసినప్పుడు, ఈ విషయాలు తెలుసుకున్నట్టు తెలిపారు.

“అతను మాట్లాడే తీరు, స్క్రీన్ మీద కనిపించిన విధానం అద్బుతం. కానీ స్క్రీన్ మీద కంటే కూడా బయట మరింత బెటర్ గా ఉంటారు. ఒక పెద్ద స్టార్‌గా ఉన్నప్పటికీ ఆయనలో ఉండే సింప్లిసిటీ, డెడికేషన్ ఆకట్టుకునే అంశాలు చాలానే ఉన్నాయి. మహేష్‌ బాబు ఆయనకున్న సొంత స్టైల్ మిగతా యాక్టర్స్‌ కంటే ప్రత్యేకంగా నిలబెడుతుంది,” అని సందీప్ వ్యాఖ్యానించారు. మహేష్‌ని ఓ వ్యక్తిగా, నటుడిగా సందీప్ చూస్తూ చెప్పిన ఈ మాటలు ఆయనపై ఉన్న గౌరవాన్ని తెలియజేస్తున్నాయి.

మహేష్-సందీప్ కలయికలో సినిమా రాబోతుందనే ఊహాగానాలు గతంలో వినిపించాయి. కానీ ప్రస్తుతం మహేష్ రాజమౌళి(S. S. Rajamouli)  చిత్రంతో బిజీగా ఉంటే, సందీప్ రెడ్డి వంగా “స్పిరిట్” (Spirit)  తో సమయాన్ని గడుపుతున్నారు. వీరి కాంబినేషన్‌లో భవిష్యత్తులో సినిమా వస్తుందా అనే ఆసక్తి సినీ అభిమానుల్లో కొనసాగుతోంది. ఏదేమైనా సందీప్ రెడ్డి వంగా మాటల ప్రకారం, మహేష్ బాబులో ఉన్న అసలు ప్రత్యేకతను అతనిని దగ్గరగా చూసినవారే గుర్తించగలరని అర్ధమవుతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

‘బచ్చల మల్లి’ రిలీజ్ డేట్.. రిస్కే !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus