ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తన అద్భుతమైన ఆట తీరుతో దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చారు. తన ఆటకే కాకుండా అందానికి కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. సానియాకి సినిమా ఇండస్ట్రీలో కొందరు స్నేహితులు ఉండడంతో ఆమె కూడా నటిస్తే బాగుంటుందని అభిమానులు కోరుకున్నారు. అయితే పాకిస్థాన్ క్రికెటర్ ని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది సానియా. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ టెన్నిస్ స్టార్ నటనపై ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. తన యాక్టింగ్ డెబ్యూకి సానియా సిద్ధమవుతోందని తెలుస్తోంది.
ఓ వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులను అలరించడానికి సానియా రెడీ అవుతోంది. ఎంటీవీ నిషేధ్ ఎలోన్ టుగెదర్ వెబ్ సిరీస్‌లో సానియా నటించనున్నారు. మొత్తం ఐదు ఎపిసోడ్స్ గా ఈ సిరీస్ సాగుతుంది. ఈ నెలాఖరు నుండి ఎంటీవీలో ఈ సిరీస్ ప్రసారం కానుంది. ఇది ఇండియాలో టీబీ వ్యాధిపై చైతన్య తీసుకొచ్చే కార్యక్రమమని సానియా చెప్పారు. టీబీపై అవగాహన కల్పించే విధంగా ఈ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. భారత్ లో టీబీ కారణంగా ఎందరో ఇబ్బంది పడుతున్నారని..
ఈ కేసుల్లో సగం మంది 30 ఏళ్లలోపు వారే ఉన్నారని సానియా వెల్లడించారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో టీబీ తీవ్ర ప్రభావం చూపుతూ మనుషుక ప్రాణాలు తీస్తోందని సానియా అభిప్రాయపడ్డారు. సానియా ఈ సిరీస్ లో నటించడానికి కారణం.. ఈ సిరీస్ కాన్సెప్ట్ ని తెలుస్తోంది. ఒక విషయంపై అవగాహన తీసుకురావడమనేది మంచి ఉద్దేశమని ఆమె ఈ సిరీస్ లో నటించడానికి అంగీకరించింది.