Sanjjanaa Galrani: ఇది హీరోయిన్ సంజన గల్రాని ప్రేమ కహాని..!

శాండిల్ వుడ్ హీరోయిన్ సంజనా గల్రానీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే..! తెలుగులో ఈమె తరుణ్ హీరోగా నటించిన ‘సోగ్గాడు’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. అయితే ప్రభాస్ హీరోగా వచ్చిన ‘బుజ్జిగాడు’ చిత్రం ఈమెకు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. అటు తర్వాత రాజశేఖర్ కు జోడీగా ‘సత్యమేవ జయతే’ చిత్రంలో కూడా నటించింది. అటు తర్వాత పలు చిత్రాల్లో నటించినా ఈమెకు సక్సెస్ లభించలేదు. దాంతో కన్నడంలో సినిమాలు చేసుకుంటుంది. ఇదిలా ఉండగా… బెంగళూరుకు చెందిన డాక్టర్ అజీజ్ ను ఈమె సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇందుకోసం ఆమె ఇస్లాం మతం తీసుకుంది. వీళ్ళ పెళ్లి ఫొటోలు కూడా బయటకొచ్చాయి. అయితే ఈ విషయాన్ని ఆమె వెంటనే రివీల్ చేయలేదు. తర్వాత ఈమె డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం కూడా జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. తాజాగా ఈ అమ్మడు తన లవ్ స్టోరీ మొత్తాన్ని బయటపెట్టింది. తన భర్త అజీజ్ పేరుని.. ఆమె మెడ వెనుక పచ్చబొట్టు పొడిపించుకుంది. అతనితో ఈమె 15 ఏళ్లుగా ప్రేమలో ఉందట.సంజన సినీ కెరీర్ 2005 లో మొదలైంది.అంటే కెరీర్ ప్రారంభం నుండే అజీజ్ తో ఈమె ప్రేమలో ఉందన్న మాట.అయితే గతంలో తన ప్రేమాయణం పై చాలా గాసిప్స్ వచ్చాయని… సోదరుడితో సమానమైన వ్యక్తితో కూడా సంబంధం పెట్టి చాలా ఘోరంగా రాసుకొచ్చారని ఈమె ఎమోషనల్ కామెంట్స్ చేసింది.

క్రికెటర్, పొలిటీషియన్, హీరోలు.. ఇలా ఎవరితో కనిపించినా ‘సంజన ఆ సెలబ్రిటీతో’ డేటింగ్ లో ఉంది అంటూ ప్రచారం చేసేవారని వాపోయింది.సుడిగాలిలా ఎన్ని పుకార్లు వచ్చినా నిజమైన ప్రేమ రాక్ సాలిడ్ గా నిలబడుతుందని ఈమె తెలిపింది. మనం కష్టాల్లో ఉన్నా మనకి నిజమైన ప్రేమ అండగా నిలబడుతుందని…. అలాంటి ప్రేమ అజీజ్ రూపంలో తనకు దొరికిందని చెప్పింది. ఓ ఫ్రెండ్ గా , గైడ్ గా, లవర్ గా, భర్తగా.. అజీజ్ నా జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడని చెప్పుకొచ్చింది.. అందుకు చాలా సంతోషంగా ఉన్నట్టు ఆమె తెలిపింది.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus