ఈ వారం ‘తండేల్’ (Thandel) వస్తుంది కాబట్టి విక్టరీ వెంకటేష్ (Venkatesh Daggubati) , దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) ..ల ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) రన్ ముగిసినట్టే అని అంతా అనుకున్నారు. కానీ అజిత్ నటించిన ‘పట్టుదల’ (Pattudala) డిజాస్టర్ అవ్వడంతో ఈ వీకెండ్ కి మళ్ళీ ప్రేక్షకులకి సెకండ్ ఆప్షన్ అయ్యింది.అయితే 25వ రోజు కూడా ఈ సినిమా రూ.50 లక్షల వరకు షేర్ ను రాబట్టింది. దీంతో రూ.150 కోట్ల షేర్ మార్క్ ను కూడా టచ్ చేసింది. ఈ వీకెండ్ కూడా ఈ సినిమా మంచి వసూళ్లు సాధించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.
ఒకసారి 25 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 41.12 cr |
సీడెడ్ | 17.99 cr |
ఉత్తరాంధ్ర | 20.32 cr |
ఈస్ట్ | 13.42 cr |
వెస్ట్ | 8.80 cr |
కృష్ణా | 9.34 cr |
గుంటూరు | 10.02 cr |
నెల్లూరు | 4.65 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 125.66 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 8.72 cr |
ఓవర్సీస్ | 15.85 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 150.23 cr (షేర్) |
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు రూ.40 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.41 కోట్ల షేర్ ను రాబట్టాలి. 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా 25 రోజుల్లో రూ.150.23 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.109.23 కోట్ల లాభాలు అందించి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరింది.