సంక్రాంతి అంటే టాలీవుడ్‌కు బహు ప్రీతి. పండగ వాతావరణంలో తెలుగువాళ్లకు సినిమాకు మించిన సందడి ఉండదు. గత కొన్నేళ్లుగా సంక్రాంతి సినిమాలు అదే రేంజిలో విజయాలు సాధిస్తున్నాయి. పెద్ద పండగకు వచ్చే సినిమాల్లో ఎక్కువ శాతం మంచి వసూళ్లే అందుకుంటున్నాయి. అయితే ఈ ఏడాది పరిస్థితి మారింది. గత సంక్రాంతి సీజన్లకు భిన్నంగా ఈ సారి స్టార్ హీరోలు సైడ్ అయిపోయారు. యువ హీరోలు వరుస కడుతున్నారు. కొవిడ్ కష్టాల నుంచి దూరంగా జరుగుతూ థియేటర్లు తెరుచుకుంటుండటంతో నిర్మాతలు ధైర్యం చేసి సంక్రాంతికి సినిమాలు తీసుకొస్తున్నారు.
సంక్రాంతి రేసులో ఉన్నాం అంటూ ఇప్పటివరకు నాలుగు సినిమాలు ముందుకొచ్చాయి. రవితేజ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘క్రాక్’, రామ్ డ్యూయల్ రోల్ చేస్తున్న ‘రెడ్’, విజయ్ ‘మాస్టర్’ పెద్ద పండగకు వస్తున్నాయి. ఈలోగా నేనూ ఉన్నానంటూ ‘బంగారు బుల్లోడు’గా అల్లరి నరేష్ వస్తున్నాడు. ఇందులో ‘బంగారు బుల్లోడు’ మీద తప్ప మిగిలిన అన్నింటి మీద మంచి అంచనాలే ఉన్నాయి. ‘క్రాక్’ కాంబినేషన్ (రవితేజ – గోపీచంద్ మలినేని) ఆసక్తి కలిగిస్తుంటే, ‘రెడ్’ ప్లాట్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఇక విజయ్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాట, టీజర్‌తోనే సినిమా మీద ఆసక్తి రేకెత్తించారు.
ఇక్కడివరకు అంతా బాగుంది. ఏటా సంక్రాంతికి చాలా సినిమాలు ప్రకటించి థియేటర్లు లేవనో, స్క్రీన్స్ దొరకలేదనో కొన్ని ఆఖరులో ఆగిపోతాయి. అలాంటిది ఇప్పుడు చాలా వరకు థియేటర్లు అందుబాటులో ఉండవు. కాబట్టి ఈ అనుమానం ఒకటి ఉంది. ఇంకొకటి కొవిడ్ భయం. కొత్త రకం కరోనా కేసులు బయటకు వస్తున్న తరుణంలో థియేటర్లు కొనసాగిస్తారా. ప్రజలు బయటకు వస్తారా అనేది చూడాలి. సంక్రాంతి సీజన్‌కు ఇంకా 20 రోజులున్నా… అప్పటికి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. గతంలో కన్నా ఎక్కువ పవర్‌ఫుల్ వైరస్ అంటున్న నేపథ్యంలో థియేటర్లు కొనసాగిస్తారా అనేది తెలియడం లేదు. ఇది అసలు పాయింట్. చూద్దాం కొత్త కేసులు రాకూడదు… థియేటర్లు ఓపెన్ అవ్వాలి.. బాక్సాఫీసు దగ్గర డబ్బులు గలగల వినిపించాలి.
Most Recommended Video
2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!