ఈ ఏడాది సీనియర్‌ స్టార్‌లు.. నెక్స్ట్‌ ఇయర్‌ కుర్ర స్టార్‌లు..!

టాలీవుడ్‌లో 2023 సంక్రాంతి సీనియర్‌ స్టార్‌ హీరోల సీజన్‌గా మారిపోయింది. నందమూరి బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’తోను, చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’తో సంక్రాంతికి వచ్చి సందడి చేశారు. ఆ సినిమాల వసూళ్ల లెక్కలు ఓవైపు నడుస్తుంటే.. మరోవైపు వచ్చే ఏడాది సంక్రాంతికి ఏం అవుతుంది అనే చర్చ మొదలైంది. కారణం.. వచ్చే సంక్రాంతికి ముగ్గురు కుర్ర స్టార్‌ హీరోల సినిమాలు సిద్ధం అవుతుండటమే.. అన్నీ అనుకున్నట్లుగా జరిగింది మెగా వర్సెస్‌ ఐకాన్‌ వర్సెస్‌ రెబల్‌ పోరు ఉండబోతోంది.

సంక్రాంతికి పెద్ద సినిమాలు రావడం మనకు చాలా రోజుల నుండి అలవాటే. ఆ పండగకు భారీ సినిమాలు వస్తే వసూళ్లు బాగుంటాయి అనేది నిర్మాతల లెక్క. అలా టాలీవుడ్‌లో రూపొందుతున్న మూడు పెద్ద సినిమాలు సంక్రాంతి సీజన్‌ మీద దృష్టి పెట్టాయి అంటున్నారు. అల్లు అర్జున్ – సుకుమార్‌ కాంబినేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘పుష్ప: ది రూల్‌’. ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని చూస్తున్నారట. తొలుత ఈ ఏడాది డిసెంబర్‌ అనుకున్నా.. వచ్చే సంక్రాంతే బెటర్‌ అనే డిస్కషన్‌ నడుస్తోందట.

శంకర్‌ – రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో దిల్‌ రాజు ఓ సినిమా రూపొందిస్తున్న సినిమా కూడా సంక్రాంతికి బరిలో నిలుస్తుంది అంటున్నారు. నిజానికి ఈ ఏడాది సంక్రాంతికే ఈ సినిమా రావాలి. కానీ శంకర్ సినిమా కదా ఆ మాత్రం లేట్‌ అవుతుంది లెండి. కొన్ని రోజుల క్రితం వార్తలొచ్చినట్లు ఈ సినిమాను దసరాకు తీసుకురావడమూ కష్టమే అంటున్నారు. అందుకే దిల్‌ రాజు తనకు ఎంతగానో కలిసొచ్చే సంక్రాంతికి ఈ సినిమా తీసుకొద్దాం అనుకుంటున్నారట.

ఇక అదే పొంగల్‌ ఫెస్టివల్‌కు ప్రభాస్‌ సినిమా కూడా వస్తుంది అనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే ఏ సినిమా వస్తుంది అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. ‘ఆదిపురుష్‌’ సినిమాను జూన్‌లో తీసుకురావాలని టీమ్‌ నిర్ణయించుకుంది. దీంతో ‘సలార్‌’, మారుతి సినిమా ఆ తర్వాత తీసుకురావాలి. అయితే ‘సలార్‌’ను సెప్టెంబరులో తీసుకొస్తామని ఇంతకుముందే చెప్పారు. కాబట్టి మారుతి సినిమా సంక్రాంతి సీజన్‌లోనే వస్తుంది.

ఇలా వచ్చే సంక్రాంతికి మెగా వర్సెస్‌ ఐకాన్‌ వర్సెస్‌ రెబల్‌ అనే పరిస్థితి వచ్చింది. ఈ ముగ్గురి మధ్యలో అనుబంధం చూస్తే చరణ్‌.. ప్రభాస్‌ మంచి ఫ్రెండ్స్‌. ఇక బన్నీ, చరణ్‌ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో 2024 పొంగల్ పోరు మామూలుగా ఉండేలా లేదు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus