జీవితం మీద, కెరీర్ మీద క్లారిటీ రావడం అంత ఈజీగా కాదు. ఎన్నో ఎదురుదెబ్బలు, నిరాశలు, కష్టాలు చూస్తే కానీ అంత పరిపక్వత రాదు. అలాంటిది రెండు సినిమాలకే జీవితాన్ని చూసినట్లు మాట్లాడుతున్నాడు సంతోష్ శోభన్. ‘ఏక్ మినీ కథ’తో తొలి హిట్ కొట్టిన సంతోష్… ‘మంచి రోజులొచ్చాయి’తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ భలే క్లారిటీగా చెప్పుకొచ్చాడు జీవితం, కెరీర్ గురించి. పని లేనప్పుడు పని దొరికితే మంచి రోజు వచ్చింది అనుకుంటాం.
అలాగే డబ్బు లేనప్పుడు డబ్బొస్తే అదే మంచి రోజు అనిపిస్తుంది. నా జీవితంలో ఇప్పుడిప్పుడే డబ్బులు సంపాదిస్తున్నా. అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న సమయంలో జీవితాన్ని బాగా ఆస్వాదించా. విజయం వచ్చిన రోజే మంచి రోజులు అనుకోకూడదు అనేది నా అభిప్రాయం. మంచి రోజులు అంటే మన మైండ్‌సెట్. ఆ రోజులు వచ్చాయని మనం అనుకుంటే వచ్చేసినట్టే అని అంటున్నాడు సంతోష్. వరుస అవకాశాలు వస్తున్నాయి కదా… మరి టాలీవుడ్‌లో సెట్ అయినట్లేనా అంటే…
నా సినిమా రిజల్ట్స్ వల్ల ఇక్కడుంటాననే నమ్మకమైతే ఏర్పడింది. అయితే స్థిరపడిపోయా అనే ఆలోచన లేదు. అలా అనిపిస్తే రిలాక్స్ అయిపోతాం. ఇండస్ట్రీలో ఎప్పుడూ ఫైట్ చేయాల్సిందే. ఇక్కడ ఎప్పుడూ ఒక అదనపు వ్యక్తికి స్థానం ఉంటుంది. మనం రిలాక్స్ అయితే… ఆ వ్యక్తి దగ్గరికి అవకాశం వెళ్లిపోతుంది. కాబట్టి ఎప్పుడూ కష్టపడాలి. విజయం సాధించాలి అని చెప్పాడు సంతోష్ శోభన్. ఏమన్నా క్లారిటీ కదా కుర్రాడిది.