Sara Ali Khan: సైఫ్, అమృతలపై సారా ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

బాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సారా అలీఖాన్ తనకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకునే పనిలో పడింది. సారా తండ్రి సైఫ్, తల్లి అమృతాసింగ్ ఇద్దరూ నటులనే విషయం తెలిసిందే. చిన్నతనంలో తన తండ్రులు నటించిన సినిమాలను చూసి.. వారు నిజంగానే నెగెటివ్ మనుషులని అనుకున్నట్లుగా సారా చెప్పుకొచ్చింది. తాజాగా ఓ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సారా స్పందిస్తూ.. 2004-2005నాటి సంగతులు గుర్తుచేసుకుంది. ఆ సమయంలో సైఫ్ ‘ఓంకారా’అనే సినిమా చేశారు.

అమృతా సింగ్ ‘కల్ యుగ్’అనే సినిమాలో నటించారు. ఈ రెండు సినిమాల్లో వీరిద్దరూ నెగెటివ్ రోల్స్ పోషించారు. ‘కల్ యుగ్’సినిమాలో అమృతాసింగ్ పోర్న్ సైట్ ఓనర్ పాత్ర పోషించింది. ఫారెన్ లో ఉంటూ.. పోర్న్ సైట్ ను నడపడానికి చాలా మంది అమాయకులను బలిచేసే పాత్రలో ఆమె నటించింది. ఆ సినిమాలు విడుదలయ్యే సమయానికి సారా వయసు పదేళ్లు. ఆ వయసులో ఆ సినిమాలు చూసినప్పుడు.. తన తల్లి తండ్రులు సినిమాల్లో కనిపించినంత చెడ్డవారేమో అని అమాయకంగా అనుకుందట సారా.

ఇలా తన తల్లిదండ్రులను తెరపై చూడడం తనలో కలిగించిన భావనను సారా వివరించి చెప్పింది. అయితే ఆ తరువాత కాలంలో ఆ భ్రమలన్నీ తొలగిపోయాయని.. తన తల్లిదండ్రులతో ఉన్న రిలేషన్ అంతులేనిదని చెప్పుకొచ్చింది.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus