కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నంకు తెలుగు నాట కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలు తెలుగులో కూడా సూపర్ హిట్లు అయిన సందర్భాలు అనేకం. ‘రోజా’ ‘దళపతి’ వంటి చిత్రాలకు డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు అంటే అతిశయోక్తి లేదు. ఆయన డ్రీం ప్రాజెక్ట్ అయిన.. ‘పొన్నియన్ సెల్వన్’ ను రెండు భాగాలుగా రూపొందించిన సంగతి తెలిసిందే. మొదటి భాగం ‘పీఎస్-1 ‘ పేరుతో 2022 సెప్టెంబర్ 30న రిలీజ్ అయ్యి తమిళనాడులో ఇండస్ట్రీ హిట్ మూవీగా నిలిచింది.
తెలుగులో కూడా ఈ మూవీ డీసెంట్ హిట్ అందుకుంది. మిగిలిన భాషల్లో కూడా పర్వాలేదు అనిపించుకుంది. ఇక ‘పొన్నియన్ సెల్వన్’ రెండో భాగం ‘పీఎస్-2 ‘ పేరుతో ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఐశ్వర్య రాయ్… నందిని, మందాకినీ అనే రెండు విలక్షణమైన పాత్రల్లో కనిపించింది . అయితే చిన్నప్పటి నందిని(జూనియర్ ఐశ్వర్య రాయ్) గా ఓ టీనేజ్ అమ్మాయి కనిపిస్తుంది. ఆమె చూడటానికి చాలా చక్కగా అందంగా కనిపిస్తుంది.
ఆమె ఎవరా అని.. కొంతమంది నెటిజన్లు గూగుల్ లో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఆ అమ్మాయి పేరు సారా అర్జున్. 2011లో సారా అర్జున్ చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తమిళ, మలయాళ, హిందీ భాషల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించింది.తెలుగులో కూడా 2015లో వచ్చిన ‘దాగుడుమూతల దండాకోర్’ అనే సినిమాలో నటించింది.
ఇక సారా అర్జున్ తండ్రి కూడా నటుడే. అతని పేరు రాజ్ అర్జున్. ఆయన పలు సినిమాల్లో అలాగే వెబ్ సిరీస్ లలో నటించాడు. ‘పొన్నియన్ సెల్వన్’ తో సారా అర్జున్ కి మంచి గుర్తింపు లభించిందని చెప్పాలి.