Sarangapani Jathakam Teaser Review: ఇంద్రగంటి మార్క్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ..!

ప్రియదర్శి (Priyadarshi) హీరోగా మారి కంటెంట్ బేస్డ్ మూవీస్ చేస్తున్నాడు. ‘మల్లేశం’ (Mallesham) ‘బలగం’ (Balagam) వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఇతని ఖాతాలో ఉన్నాయి. ప్రస్తుతం అతను స్టార్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ (Mohana Krishna Indraganti) దర్శకత్వంలో ‘సారంగపాణి జాతకం’ (Sarangapani Jathakam) అనే సినిమా చేస్తున్నాడు. ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ (Uma Maheswara Ugra Roopasya) ఫేమ్ రూప కొడువాయూర్ (Roopa Kodayur) హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘శ్రీదేవి మూవీస్’ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ (Sivalenka Krishna Prasad) నిర్మిస్తున్నారు. డిసెంబర్ 20 న విడుదల కాబోతున్న ఈ చిత్రం టీజర్ ను నేడు స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) లాంచ్ చేశారు.

Sarangapani Jathakam Teaser Review

‘సారంగపాణి జాతకం’ టీజర్ విషయానికి వస్తే.. ఇది 1 : 58 నిమిషాల నిడివి కలిగి ఉంది. జాతకాల పిచ్చి ఉన్న ఓ హీరో ప్రతిరోజూ ఉదయం పేపర్లో తన రాశి గురించి ఏం ఉందో తెలుసుకొని దాని ఆధారంగా నడుచుకుంటాడు.జాతకాల పిచ్చి వల్ల.. అతని జీవితంలో చోటు చేసుకున్న మార్పులు ఏంటి? అతను కత్తితో నరేష్ ను (Naresh) ఎందుకు పొడిచాడు? తనికెళ్ళ భరణి (Tanikella Bharani) వల్ల సారంగపాణికి ఎదురైన సమస్యలు ఏంటి? సుందరమ్మ అనే వృద్ధురాలు మరణిస్తే అతను ఎందుకు హ్యాపీగా ఫీలయ్యాడు వంటి విషయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

శ్రీనివాస్ అవసరాల (Srinivas Avasarala) , ‘వెన్నెల’ కిశోర్ (Vennela Kishore) , హర్ష చెముడు (Harsha Chemudu)  ..ల కామెడీ ఇందులో హైలెట్ అయ్యే విధంగా ఉంది. ‘మొత్తం మనిషిలో ఆ ఒక్క పార్ట్ గుర్తుందా ఈవిడకి’ – ‘బీ కార్పొరేట్, నాట్ డెస్పరేట్’ అంటూ వెన్నెల కిషోర్ పలికే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ‘సారంగం అని ధనుస్సు చేతిలో ఉన్నవాడు సారంగపాణి’ అంటూ అవసరాల శ్రీనివాస్ పలికే డైలాగ్ టైటిల్ కి జస్టిఫికేషన్ గా అనిపించింది. మొత్తంగా టీజర్ అయితే దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ స్టైల్లో ఎంటర్టైనింగ్ గా ఉంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

ల్ రాజు చెప్పారు సరే.. వర్కౌట్ అవుతుందా?

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus