బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ నుంచీ సెవన్ ఆర్డ్స్ సరయు ఎలిమినేట్ అయినట్లుగా సమాచారం తెలుస్తోంది. నిజానికి సెవన్ ఆర్డ్స్ సరయు అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ లో సేఫ్ జోన్ లోనే ఉంది. అనిల్ రాథోడ్ , ఇంకా మిత్రా శర్మా వీరిద్దరు మాత్రమే డేంజర్ జోన్ లో ఉన్నారు. కానీ, అఫీషియల్ హాట్ స్టార్ ఓటింగ్ ప్రకారం సరయు లీస్ట్ లో ఉందని ఎలిమినేట్ చేసినట్లుగా సమాచారం తెలుస్తోంది. అయితే, సరయుని ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్ లో ఉంచారా లేదా ఎలిమినేట్ చేసి పంపించేశారా అనేది ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యాక తెలుస్తుంది.
గత రెండు వారాలుగా సరయు నుంచీ టాస్క్ లలో ఎలాంటి పెర్ఫామన్స్ కనిపించలేదు. గతవారం జరిగిన కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో అనూహ్యంగా సెకండ్ లెవల్ కి వచ్చింది. హౌస్ లో మహేష్ విట్టా, హమీదా సపోర్ట్ తో కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచింది. కెప్టెన్సీ టాస్క్ లో సంచాలక్ అరియానా తీస్కున్న అనూహ్యమైన నిర్ణయం కారణంగా కెప్టెన్ కాలేకపోయింది. ఇక హౌస్ నుంచీ ఇప్పుడు నాలుగో వారమే ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది.
అరియానాకి సరయుకి గేమ్ లో చాలా డిఫరెన్స్ వచ్చాయి. ఈవారం నామినేషన్స్ లో అరియానా సరయుని టార్గెట్ చేసి మరీ నామినేట్ చేసింది. బాడీ షేమింగ్ విషయంలో అరియానా నాగార్జున ఎపిసోడ్ లో సారీ చెప్పినా కూడా ఆ తర్వాత నామినేషన్స్ లో ఈ ఇష్యూని మళ్లీ తీసుకుని వచ్చి మరీ నామినేట్ చేసింది. దీంతో సరయుకి రెండు ఓట్లు పడ్డాయి. సరయు నామినేషన్స్ లోకి వచ్చింది. తనకంటే వీక్ కంటెస్టెంట్స్ ఉన్నా కూడా పబ్లిక్ ఓటింగ్ కారణంగా ఎలిమినేట్ అయిపోవాల్సి వచ్చింది.
మొత్తానికి సీజన్ 5లో మొదటివారమే ఎలిమినేట్ అయిన సరయు ఈసారి నాలుగు వారాలపాటు హౌస్ లో ఉంది. కానీ, ఏ టాస్క్ లోనూ హైలెట్ అవ్వలేకపోయింది. అంతేకాదు, ఎమోషనల్ గా కూడా బాగా వీక్ గా ఉండటం అనేది సరయు గేమ్ ని దెబ్బకొట్టిందనే చెప్పాలి. ఎదుటివాళ్లతో ఆర్గ్యూమెంట్ లో బలం లేకపోవడం, గట్టిగా ప్రశ్నించలేకపోవడం కూడా గేమ్ లో మైనస్ అయ్యింది. అందుకే, సరయు ఎలిమినేట్ అయ్యింది.