తమిళంలో పాజిటివ్ టాక్ సంపాదించుకున్న మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’..!

కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల థియేటర్లు 7నెలలుగా మూతపడే ఉన్నాయి. మెల్లమెల్లగా వాటిని ఓపెన్ చెయ్యడానికి డిస్ట్రిబ్యూటర్లు ప్రయత్నిస్తున్నారు కానీ.. జనాల్లో కరోనా భయం ఇంకా తగ్గకపోవడంతో ఫలితం పెద్దగా కనిపించడం లేదు. మొన్ననే కొన్ని పాత సినిమాలతో వైజాగ్ లోని ఐనాక్స్ ను ఓపెన్ చేశారు. అయితే కనీసం ఒక్కో స్క్రీన్ కు 10 మంది కూడా రాలేదు. ఇలాంటి టైంలో మన తెలుగు సినిమాని తమిళంలో డబ్ చేసి విడుదల చేశారు.

అదే మన మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం. నిన్ననే(నవంబర్ 20న) ఈ చిత్రం తమిళంలో 220 థియేటర్లలో 50 శాతం ఆకుపెన్సీ తో విడుదలయ్యింది. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ఈ చిత్రానికి అక్కడ పాజిటివ్ టాక్ వస్తుండడం విశేషం. మాస్ ఎంటర్టైనర్ అంటూ ఈ చిత్రాన్ని అక్కడి ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. ఇక కలెక్షన్స్ పరంగా ఈ చిత్రం అక్కడ మొదటి రోజు 0.12 లక్షల గ్రాస్ వసూళ్ళను రాబట్టిందట. ఓ డబ్బింగ్ చిత్రానికి అదీ కరోనా టైములో ఇలాంటి కలెక్షన్స్ ఎక్కువనే చెప్పాలి.

ఈరోజు నిన్నటికి మించి బుకింగ్స్ నమోదవుతున్నాయని సమాచారం. మహేష్ బాబు గత చిత్రం ‘ఆగడు’ ఇక్కడ ఫ్లాప్ అయినప్పటికీ.. తమిళంలో డబ్ అయినప్పుడు అక్కడ విజయం సాధించింది. దీనిని బట్టి చూస్తుంటే.. తమిళ ప్రేక్షకులు మహేష్ బాబు నుండీ పక్కా మాస్ సినిమాలు ఆశిస్తున్నట్టు స్పష్టమవుతుంది.

Most Recommended Video

మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా రివ్యూ & రేటింగ్!
అనగనగా ఓ అతిధి సినిమా రివ్యూ & రేటింగ్!
రెండు చేతులా సంపాదిస్తున్న 13 హీరోయిన్లు..వీళ్లది మామూలు తెలివి కాదు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus