Saripodhaa Sanivaaram: ‘సరిపోయిందా శనివారం’ వాటికి ఫుల్ స్టాప్ పెట్టేసినట్టేగా?

  • August 29, 2024 / 10:31 PM IST

ఓ సినిమాకు సంబంధించిన టీజర్ కానీ, ట్రైలర్ కానీ రిలీజ్ అయ్యాయి.. అంటే నెటిజెన్లు, మీడియా వాళ్ళు మెదడుకి చాలా పదును పెడుతూ ఉంటారు. టీజర్ లేదా ట్రైలర్లో ఏదైనా షాట్.. వేరే సినిమాకి సిమిలర్ గా ఉంది అంటే.. ఇక ఊహాగానాలకు తెరలేపుతూ ఉంటారు. ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram)  విషయంలో కూడా అలాంటిదే జరిగింది. ఈ సినిమా కథ ‘శనివారం నాది’ అనే నవల ఆధారంగా రూపొందింది అంటూ ఊహాగానాలు మొదలయ్యాయి.

Saripodhaa Sanivaaram

సినిమా ప్రమోషన్స్ లో కూడా టీంకి ఈ నవల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. వాటికి టీం స్పందించి.. ‘అందులో వాస్తవం లేదు’ అని చెప్పుకొచ్చింది. ‘శనివారం నాది’ అనే నవల ప్రకారం.. అందులో ఓ సైకో శనివారం పూట అత్యాచారాలు వంటివి చేస్తాడు. కానీ ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) కథ పూర్తిగా వేరు. ఇందులో హీరో కోపిష్టి. కానీ తల్లికి ఇచ్చిన మాట ప్రకారం.. శనివారం పూట మాత్రమే తన కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు.

అందువల్ల విలన్ గ్యాంగ్ ఇతనికి ఎలాంటి సమస్యలు తెచ్చిపెట్టారు? సోకులపాలెం కథ ఏంటి? తన మరదలు ఎలా దూరమైంది? ఇలా ఎన్నో అంశాలు టచ్ చేసి ఉన్న కథ ఇది. సో సినిమా చూశాక.. దీనిపై ఎలాంటి ఆరోపణలు రాలేదు. ఇది పక్కన పెడితే.. కొంతమంది అయితే అల్లు అర్జున్ (Allu Arjun) ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ (Naa Peru Surya, Naa Illu India) సినిమాలో కూడా హీరో కోపిష్టి. కాబట్టి ఆ కథ.. ఈ కథ కూడా ఒకటే అంటూ వాదించిన సందర్భాలు అందరికీ గుర్తుండే ఉంటాయి. అవన్నీ పటాపంచలు అయిపోయినట్టు అయ్యింది.

శ్రీవిష్ణు హ్యాట్రిక్ కొడతాడా.. ‘స్వాగ్’ టీజర్ ఎలా ఉంది.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus