మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ చిత్రం మే 12న విడుదలైంది. పరశురామ్(బుజ్జి) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’, ’14 రీల్స్ ప్లస్’, ‘జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్’ సంస్థలు కలిసి నిర్మించాయి. మొదటి షోతోనే ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ మొదటి వారం మంచి కలెక్షన్లను సాధించాయి. వీక్ డేస్ లో కూడా ఈ మూవీ డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యం కలిగించే విషయం.
నిన్న 8 వ రోజున కూడా 7 వ రోజుతో సమానంగా కలెక్ట్ చేసింది ఈ మూవీ. టికెట్ రేట్లు తగ్గడం వలన కొంచెం ప్లస్ అయినట్టు స్పష్టమవుతుంది. మరి రెండో వీకెండ్ బుకింగ్స్ ఎలా ఉంటాయో చూడాలి.’సర్కారు వారి పాట’ 8డేస్ కలెక్షన్స్ ను ఓసారి గమనిస్తే :
నైజాం
31.81 cr
సీడెడ్
10.66 cr
ఉత్తరాంధ్ర
10.81 cr
ఈస్ట్
8.01 cr
వెస్ట్
4.93 cr
గుంటూరు
8.21 cr
కృష్ణా
5.69 cr
నెల్లూరు
3.32 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
83.44 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
5.78 cr
ఓవర్సీస్
11.52 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
100.74 cr
‘సర్కారు వారి పాట’ చిత్రానికి రూ.120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.121 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 8 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.100.74 కోట్ల షేర్ ను రాబట్టింది. నిన్న గురువారం రోజున కూడా ఈ మూవీ బాగానే పెర్ఫార్మ్ చేసింది. నెగిటివ్ టాక్ తో ఇలా కలెక్ట్ చేస్తుండడం అంటే మాములు విషయం కాదు.
అయితే బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ ఇంకా రూ.19.26 కోట్ల షేర్ ను రాబట్టాలి. అది ఈజీ టార్గెట్ అయితే కాదు.రెండో వీకెండ్ ను భారీగా క్యాష్ చేసుకుని.. తర్వాత కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేస్తే ఛాన్సులు ఉంటాయి. అయితే మహేష్ బాబు రూ.100కోట్ల షేర్ మార్క్ ను దాటేశాడు. మహేష్ కెరీర్లో 3 వ రూ.100 కోట్ల షేర్ మూవీ ఇది..!