ప్రముఖ ఓటీటీలలో ఒకటైన అమెజాన్ ప్రైమ్ వరుసగా భారీ బడ్జెట్ సినిమాలను కొనుగోలు చేయడంతో పాటు తక్కువ సమయంలోనే ఆ సినిమాలను ఓటీటీలో అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. సర్కారు వారి పాట సినిమా హక్కులను కూడా అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసిందని సమాచారం. ఈ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ ఏకంగా 50 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని తెలుస్తోంది. సర్కారు వారి పాట స్థాయికి ఈ మొత్తం ఎక్కువ మొత్తమే అని చెప్పాలి.
సర్కారు వారి పాట తెలుగులో మాత్రమే విడుదలైన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా తెరకెక్కి ఉంటే ఈ సినిమా డిజిటల్ హక్కులు మరింత ఎక్కువ మొత్తానికి అమ్ముడయ్యే ఛాన్స్ అయితే ఉండేది. మరోవైపు ఈ సినిమా ఓటీటీలో ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అవుతుందో క్లారిటీ రావాల్సి ఉంది. ఇతర ఓటీటీలతో పోల్చి చూస్తే అమెజాన్ ప్రైమ్ పెద్ద సినిమాల స్ట్రీమింగ్ విషయంలో ముందంజలో ఉంది. సర్కారు వారి పాట థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు సంబంధించి క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.
మరోవైపు ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తుండటంతో మహేష్ బాబు అభిమానులు ఒకింత టెన్షన్ పడుతున్నారు. మరోవైపు సర్కారు వారి పాట బుకింగ్స్ ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉన్నాయి. వీకెండ్ వరకు టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమా కలెక్షన్లను సొంతం చేసుకునే ఛాన్స్ అయితే ఉంది.
ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 సినిమాల తర్వాత విడుదలవుతున్న పెద్ద సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలవుతున్నాయి. టికెట్ రేట్లను పెంచడం పెద్ద సినిమాలకు ఒకింత డ్యామేజ్ చేస్తోందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సాధారణ టికెట్ రేట్లతోనే పెద్ద సినిమాలను విడుదల చేస్తే పెద్ద సినిమాలకు బెనిఫిట్ కలిగే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.