Sarkaru Vaari Paata: సర్కారు వారి పాటకు ప్లస్, మైనస్ లు ఇవే!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సర్కారు వారి పాట మరో వారం రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది. ఎంటర్టైన్మెంట్ సినిమాలను కోరుకునే ప్రేక్షకులకు సర్కారు వారి పాట సినిమా బెస్ట్ ఆప్షన్ గా నిలవనుంది. సర్కారు వారి పాట ట్రైలర్ నెట్టింట వైరల్ కాగా దాదాపుగా రెండున్నరేళ్ల తర్వాత మహేష్ హీరోగా నటించి రిలీజవుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. సర్కారు వారి పాట సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఫ్యామిలీ ఆడియన్స్ సైతం ఈ సినిమాపై దృష్టి పెట్టే ఛాన్స్ అయితే ఉంది.

మహేష్ బాబు లుక్స్ ఆకట్టుకునేలా ఉండటం ఈ సినిమాకు అడ్వాంటేజ్ అవుతుంది. కమర్షియల్ హంగులతో తెరకెక్కిన సినిమా కావడంతో మాస్ ప్రేక్షకులు సైతం ఈ సినిమా కొరకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇతర పెద్ద సినిమాల హవా తగ్గడం ఈ సినిమాకు ఒకింత ప్లస్ అవుతోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో పరీక్షలు జరుగుతుండటం సర్కారు వారి పాటకు ఒక విధంగా మైనస్ అవుతోంది. సర్కారు వారి పాట సినిమా ఈ గండం నుంచి గట్టెక్కితే మాత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో కొత్త రికార్డులు క్రియేట్ అవుతాయి.

సమ్మర్ సీజన్ కావడం కూడా మహేష్ బాబు సినిమాకు కలిసొస్తుందని చెప్పవచ్చు. ఈ సినిమాతో మహేష్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఈ సినిమాను నిర్మించగా రికార్డు స్థాయిలో ఈ సినిమాకు బిజినెస్ జరిగింది. ఇప్పటికే ఈ సినిమాకు పని చేసిన టెక్నీషియన్లు, దర్శకుడు పరశురామ్, హీరోయిన్ కీర్తి సురేష్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నారు. మహేష్ బాబు లుక్స్ కు ప్రశంసలు దక్కుతుండగా మహేష్ బాబు మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus