సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమా థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 సినిమాల హవా తగ్గడం, ఆచార్య సినిమా ఫ్లాప్ కావడంతో సర్కారు వారి పాటకు థియేటర్ల విషయంలో కూడా ఎటువంటి సమస్యలు లేవని తెలుస్తోంది. సర్కారు వారి పాట ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోగా ఈ నెల 7వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుందని తెలుస్తోంది.
యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఈ ఈవెంట్ జరగనుందని తెలుస్తోంది. అయితే ఈ ఈవెంట్ కు మహేష్ భవిష్యత్తు సినిమాల దర్శకులు అయిన రాజమౌళి, త్రివిక్రమ్ హాజరయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఈ ఈవెంట్ అతిథులకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ తో అంచనాలను మరింత పెంచాలని మేకర్స్ భావిస్తున్నారు. సర్కారు వారి పాటకు బాక్సాఫీస్ వద్ద పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఈ సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన రికార్డులు క్రియేట్ అవుతాయనడంలో సందేహం అవసరం లేదు.
సర్కారు వారి పాట సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీకి కొత్త కళ తెస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. వేర్వేరు కారణాల వల్ల సర్కారు వారి పాట షూటింగ్ అంతకంతకూ ఆలస్యమైంది. అయితే ప్రస్తుతం కరోనా కేసులు తగ్గి బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాలకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు సినిమాల విషయంలో వేగం పెంచనున్నారు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమాలో, రాజమౌళి డైరెక్షన్ లో మరో సినిమాలో మహేష్ బాబు నటించనున్నారు.
ఈ రెండు సినిమాల షూటింగ్ లు తక్కువ సమయంలోనే పూర్తి కానున్నాయని తెలుస్తోంది. మహేష్ బాబు కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ కచ్చితంగా విజయాలు దక్కేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మహేష్ ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయల నుంచి 60 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.