మలయాళంలో విడుదల కానీ సరైనోడు..వాయిదా!

బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం సరైనోడు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 22 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం మలయాళంలోనూ విడుదల కావలసి ఉండగా.. పలు అనుకోని కారణాల రిత్యా ఈ చిత్రం వాయిదా పడింది.

యోధవ్ గా మలయాళంలో విడుదల అవుతున్న ఈ చిత్రం..వాయిదాతో ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో బన్నీ సరసన రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ తెరిసాలు జంటగా నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్ పతాకం పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags