మలయాళంలో ‘సరైనోడు’ మరోసారి వాయిదా..!

బోయపాటి శ్రీను దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం ‘సరైనోడు’. ఈ చిత్రం విడుదలైన వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.70 కోట్ల కలెక్షన్స్(గ్రాస్) ను వసూలు చేసినట్లు సమాచారం. మరోవైపు ఈ చిత్రం మలయాళంలో ‘యోధవ్’ పేరుతో విడుదల కావలసి ఉండగా..

ఈ చిత్రం ఏప్రిల్ 29 కి వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం ఏప్రిల్ 29 న కూడా విడుదల కాకుండా.. మరోసారి వాయిదా పడి మే 13 న విడుదల కానుంది. గీతా ఆర్ట్స్ పతాకం పై నిర్మించిన ఈ చిత్రంలో బన్నీ సరసన రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ తెరిసా లు జంటగా నటించగా.. ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్ర పోషించాడు. తమన్ ఈ చిత్రానికి స్వరాలు అందించాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus