మాతృత్వం కోసం ఎంతో మంది మహిళలు పరితపిస్తుంటారు. తల్లైన మహిళను.. ఓ రాణితో సమానంగా చూసే సమాజం మనది. ఇక ఆ తల్లైన మహిళకి ‘సమస్తం తన బిడ్డే’ అనుకుంటుంది. కానీ ఓ నటి మాత్రం తన బిడ్డను చంపాలని ప్రయత్నించినట్టు చెప్పి వార్తల్లోకెక్కింది. అది పుట్టిన 4 రోజులకే. వినడానికి ఘోరంగా అనిపిస్తుంది కదూ. వివరాల్లోకి వెళితే.. సర్వత్ గిలానీ అనే ఓ పాక్ నటి ఇలాంటి ఘోరానికి పూనుకున్నట్టు తెలుస్తుంది.
ఆమె ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘‘నేను ప్రెగ్నెంట్ అయ్యాను అని తెలిసి చాలా ఆనంద పడ్డాను. ప్రెగ్నెన్సీని ఎంతో ఎంజాయ్ చేశాను. అయితే డెలివరీ టైంలో నాకు సర్జరీ జరిగింది. 4 రోజుల తర్వాతే నా బిడ్డను ఎత్తుకోగలిగాను. కానీ నా బిడ్డకు పాలివ్వలేకపోయాను. అలాంటి ఘోరమైన పరిస్థితుల్లో నేను అల్లాడిపోయాను. దీంతో ఎంతో ఒత్తిడికి గురయ్యి.. డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. ఆ టైంలో నా బిడ్డ అలాంటి బాధ అనుభవించే కంటే చనిపోతే బెటర్ అనే ఘోరమైన ఆలోచన వచ్చింది.
నవమాసాలు మోసిన బిడ్డను చంపాలనుకోవడం చాలా పాపం. అలాంటి ఆలోచనలు నాకెందుకు వస్తున్నాయో నాకు అర్థం కాలేదు. దీంతో నా భర్తకి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాను. ఆయన నన్ను అర్థం చేసుకున్నాడు. నా సమస్య ఏంటో నేను తెలుసుకునేలా చేశాడు. అప్పుడు నేను మెల్లగా కోలుకున్నాను. ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదనే.. నేను ఈ పోస్ట్ పెడుతున్నాను” అంటూ చెప్పుకొచ్చింది సర్వత్ గిలానీ