Sathyam Sundaram Collections: ‘సత్యం సుందరం’ మొదటి వారం ఎంత కలెక్ట్ చేసిందంటే?
- October 5, 2024 / 01:24 PM ISTByFilmy Focus
కార్తీ (Karthi) , అరవింద్ స్వామి (Arvind Swamy) కాంబినేషన్లో ‘సత్యం సుందరం’ (Sathyam Sundaram) (తమిళంలో మెయాజ్‌హగన్) అనే సినిమా రూపొందింది. ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ ఇంప్రెస్ చేశాయి. తమిళంలో ’96’, తెలుగులో ‘జాను'(96 రీమేక్) వంటి సినిమాలు చేసిన సి ప్రేమ్ కుమార్ (C. Prem Kumar) ..దీనికి దర్శకుడు. సెప్టెంబర్ 27న తమిళంలో ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. తెలుగులో ‘దేవర’ (Devara) వంటి పెద్ద సినిమా ఉండటంతో ఒకరోజు ఆలస్యంగా అంటే సెప్టెంబర్ 28న విడుదల చేశారు. తెలుగులో ఈ చిత్రాన్ని ‘ఏషియన్ సురేష్’ సంస్థ విడుదల చేసింది.
Sathyam Sundaram Collections

మొదటి రోజు ఈ సినిమా తెలుగులో కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే ‘దేవర’ పోటీగా ఉండటంతో.. ఓపెనింగ్స్, పర్వాలేదు అనిపించే విధంగా మాత్రమే నమోదయ్యాయి. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :
| నైజాం | 1.35 cr |
| సీడెడ్ | 0.55 cr |
| ఉత్తరాంధ్ర | 0.63 cr |
| ఈస్ట్+వెస్ట్ | 0.33 cr |
| కృష్ణా + గుంటూరు | 0.44 cr |
| నెల్లూరు | 0.20 cr |
| ఏపి+ తెలంగాణ | 3.5 cr (షేర్) |
‘సత్యం సుందరం’ చిత్రానికి రూ.6.27 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.7 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.3.5 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం ఈ చిత్రం ఇంకా రూ.3.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. రెండో వీకెండ్ ను గట్టిగా క్యాష్ చేసుకుంటే తప్ప.. బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
‘దేవర’ బ్రేక్ ఈవెన్ సాధించి.. క్లీన్ హిట్ లిస్టులోకి ఎంట్రీ ఇచ్చిన ‘దేవర’?














