‘క్షణం’ తమిళ రీమేక్ హక్కులు దక్కించుకున్న కట్టప్ప తనయుడు!

తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ‘క్షణం’.. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని ఇప్పుడు హిందీ, తమిళ భాషల్లో రీమేక్ చేస్తుండగా.. ఈ చిత్రం తమిళ రీమేక్ హక్కులను “బాహుబలి” చిత్రంలో “కట్టప్ప”గా కీలకపాత్ర పోషించిన సత్యరాజ్ కుమారుడు సిబిరాజ్ దక్కించుకున్నాడు.

తమిళంలో రీమేక్ కానున్న ఈ చిత్రంలో సిబిరాజ్ ప్రధాన పాత్రలో నటించనుండగా.. ఈ సినిమాకి సంబంధించిన మిగిలిన వివరాలు త్వరలోనే విడుదల కానున్నాయి. తమిళంలో ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారు? హీరోయిన్లుగా ఎవెరెవరు నటిస్తారు? అనే విషయాలు మాత్రం తెలియాల్సి ఉంది!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus